Narasimha Rao backed decision to reject Dawood Ibrahim’s conditional offer of surrender: Sharad Pawar

Narasimha rao backed his move to reject dawood s surrender pawar

Dawood Ibrahim, Sharad Pawar, NCP, PV Narasimha Rao, Indian government, Congress, 1993 Mumbai blasts, Maharashtra, underworld in Mumbai, Ram Jethmalani

NCP chief Sharad Pawar has come up with some startling revelations in his memoir 'On My Terms: From the Grassroots to the Corridors of Power'.

దావూద్ లొంగుబాటు కండీషన్లకు అప్పటి ప్రధాని పివీ అంగీకరించలేదు..

Posted: 12/13/2015 07:33 PM IST
Narasimha rao backed his move to reject dawood s surrender pawar

1993 ముంబై పేలుళ్ల కేసు వెనుక ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం గొంతెమ్మ కోరికలు కోరుతూ, లొంగుబాటుకు పంపిన ప్రతిపాదనలను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు వ్యతిరేకించారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. షరతులకు పీవీ అంగీకరించివుంటే అండర్ వరల్డ్ డాన్ లొంగిపోయి ఉండేవాడని "ఆన్ మై టర్మ్స్: ఫ్రం ది గ్రాస్ రూట్స్ టు ది కారిడార్ ఆఫ్ పవర్" అంటూ రాసిన పుస్తకంలో శరద్ ప్రస్తావించారు.

ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీని దావూద్ సంప్రదించాడని, లొంగిపోయి విచారణకు సహకరిస్తానని, అయితే, తనను జైల్లో ఉంచకుండా, గృహ నిర్బంధంలో ఉంచాలన్నది దావూద్ ప్రధాన డిమాండని చెప్పుకొచ్చారు. ఈ విషయమై దావూద్ ప్రతిపాదనలను అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తాను, ప్రధాని పీవీతో చర్చించినట్టు చెప్పారు. దావూద్ డిమాండ్లను పీవీ అంగీకరించలేదని వివరించారు. ముంబై దాడుల తరువాత పీవీ తనకు ఫోన్ చేసి, "మీ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు తెలిసింది. వ్యక్తిగత భద్రతను పెంచుకోండి" అని సలహా ఇచ్చారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  Sharad Pawar  PV Narasimha Rao  

Other Articles