Supreme Court refuses Nestle's plea

Supreme court refuses nestle s plea

Nestle, Maggi, Supreme court, India, Nestles plea in SUpreme court

The Supreme Court refused to stay a class action suit filed by the central government against NestleBSE 2.05 % India over the company's popular Maggi noodles. The noodles were banned by the food regulator earlier this year after it said tests showed excessive amount of lead and traces of flavour enhancer monosodium glutamate in the product, but the Bombay High Court has struck downthe order

నెస్లేకి సుప్రీంకోర్ట్ లో ఎదురుదెబ్బ

Posted: 12/13/2015 01:29 PM IST
Supreme court refuses nestle s plea

మ్యాగీ నూడుల్స్‌ ఉత్పత్తి సంస్థ నెస్లే ఇండియాకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. నెస్లే ఇండియాపై ప్రభుత్వం దాఖలు చేసిన క్లాస్‌ యాక్షన్‌ వ్యాజ్యంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శనివారం తిరస్కరించింది. ఈ నూడుల్స్‌ను భారత ఆహార భద్రతా సంస్థ (ఎఫ్‌ఎన్‌ఎన్‌ఏఐ) నిషేధించిన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు సూచనల మేరకు మ్యాగీపై ప్రయోగశాలల్లో తిరిగి పరీక్షలు నిర్వహించగా, ఆరోగ్యానికి హానికరమైనవేమీ లేవంటూ సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఆహార భద్రత, ప్రమాణాలకు సంబంధించి ఎఫ్‌ఎన్‌ఎన్‌ఏఐ ఆందోళన వ్యక్తం చేయడంతో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ (ఎన్‌సిడిఆర్‌సి)లో కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యం దాఖలు చేసింది. దీంతో తాజాగా పరీక్షలు జరపాలని ఎన్‌సిడిఆర్‌సి ఆదేశించింది. మ్యాగీ ఉత్పత్తికి హైకోర్టు క్లియరెన్స్‌ ఇచ్చినందున ఈ పరీక్షలపై స్టే విధించాలని నెస్లే లాయర్‌ హరీష్‌ ఎన్‌ సాల్వే ఎన్‌సిడిఆర్‌సిని కోరారు. మరోవైపు నెస్లే విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం కూడా శనివారం తిరస్కరించింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, పిసి పంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని విచారణకు స్వీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nestle  Maggi  Supreme court  India  Nestles plea in SUpreme court  

Other Articles