caught on camera, wife shows cheating husband who is boss, slaps her love rival when she admits defeat

Scorned wife sits on her cheating husband s bmw

mexico wife, husband caught with girl friend, BMW car, wife sits on bmw bonnet, cheating husband, police officers, Wife shows cheating husband, Wife Camera, Cam, Husband, Scorned,wife,sits,cheating,husband,s,BMW,stop,driving,mistress,slaps,love,rival,admits,defeat

This woman decided to take revenge on her cheating husband by cornering him while he was on a date with his mistress.

ITEMVIDEOS: పెళ్లామా.. మజాకా..? నట్టనడివీధిలో మొగుడిని, అతని గర్ల్ ఫ్రెండ్ ని కడిగేసింది..

Posted: 12/12/2015 04:16 PM IST
Scorned wife sits on her cheating husband s bmw

పెళ్లాం అంటే అర్థాంగి. అంటే భర్తలో సగం.. అందుకనే అమెకు సగభాగం ఇచ్చిన మగాడైన మగుడు.. మిగతా సగభాగాన్ని తన ప్రియురాలికి ఇస్తాడు.. అంటూ అడ్డదిడ్డమైన సమాధానంతో పెళ్లైనా.. పక్కదారులను పట్టికుని తిరిగే వారికి భార్యల అర్థం చెప్పే ఘటన మెక్సికోలో జరిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నా.. తన వాళ్లకు చెప్పి కుమిలిపోయే భార్యలున్న ఈ భారతీయ సమాజంలో.. ఆ మెక్సికో ఇల్లాలు ఆదర్శంగా నిలుస్తుంది. శుభలగ్నం చిత్రంలో అమని జగపతిబాబును అనుమానించి వెంబడించి అల్లరి పెడితే.. ఇక్కడ మాత్రం తన భర్త గురించి పూర్తిగా తెలుసుకున్న భార్య నట్టనడిరోడ్డు మీద అవమానించింది.

తన భర్త వేరే యువతితో సంబంధం కలిగి ఉన్నాడని తెలుసుకుని షాక్ కు గురైన ఆ భార్య.. వారు డేటింగ్ కు వెళ్లే సమయంలో అదీనూ నడిరోడ్డు మీద వారి పరువు తీసి ఉతికేయాలని నిర్ణయించుకుంది. అంతే అనుకున్న మేరకు వారు డేటింగ్ సిద్దమవుతున్నారన్న సమాచాంతో ఆమె నడిరోడ్డుపైకి వచ్చేసింది. వారిద్దరూ ప్రయాణిస్తున్న బిఎండబ్ల్యూ కారు ఆపి పైకి ఎక్కి కూర్చుంది. ప్రియురాలితో తెగదెంపులు చేసుకుంటేనే దిగుతానని భీష్మించింది. ఈలోగా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. తప్పేది లేక అతడు తన ప్రియురాలికి సారీ చెప్పేశాడు. కారు దిగి వెళ్లిపోతున్న తన మొగుడి ప్రియురాలి చెంప చెళ్లుమనిపించింది. ఆ తర్వాత కారుదిగి అదేకారులో వెళ్లిపోయింది. మొగుడి ప్రియురాలు తిట్టుకుంటూ మరో కారులో పారిపోయింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mexico wife  husband  girl friend  BMW car  

Other Articles