methenol added in liquor ar swarna bar alleges minister kamineni

Hooch tragedy chemicals added in bar says fsl report

Illicit Liquor, Hooch, Five dead, Vijayawada, swarna bar, swarnamaye bar, spurious liquor, ban on few liquor brands, AP Government bans few liquor brands, major hoonch tragedy in krishna, government bans few liquor brands, AP Government, ban, few liquor brands

forensic report stated in his inquiry report that adulteration of the liquor took place in the bar itself.

ఆ మద్యంలో కల్తీ జరిగింది.. కిక్కు కోసం రసాయనాలు కలిపారు..

Posted: 12/11/2015 03:40 PM IST
Hooch tragedy chemicals added in bar says fsl report

విజయవాడ కల్తీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో స్వర్ణ బార్ యజమాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడైన శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ప్రశ్నించగా, మద్యంలో కల్తీ చేసినట్టుగా వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. బార్ మేనేజర్ వెంకటేశ్వరరావు మద్యం సీసాల్లో ఏదో కలుపుతున్నట్టు గుర్తించానని ఆయన చెప్పినట్టు సమాచారం. అధిక లాభం కోసమే ఇలా చేసినట్టు తమ విచారణలో తెలిపినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు పోలీసులకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మద్యంలో ఓ రసాయనం కలసినట్టు నివేదికలో వెల్లడించారు.

కాగా,  మద్యంలో మరింత కిక్కు కోసం మిథనాల్ కలిపారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని తెలిపారు. ఈ విషయం స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల పరీక్షలో వెల్లడైందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. కల్తీ మద్యం ఘటనలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 27 మంది కోలుకున్నారని ఆయన తెలిపారు. బాధితులను పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత వెంకట్రావు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మరో ఆసుపత్రిలో ఉన్న వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిందని కామినేని వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Illicit Liquor  Hooch  Vijayawada  AP swarna bar  

Other Articles