Bride rejects groom for not knowing how to use a smart phone!

Bride calls off marriage after groom fails math test

Bride calls off marriage after groom fails ‘math test’, bride rejects groom as he, failed to use smart phone, bride, kushboo, bridegroom, omveer, smart phone, maths, degree, Araiyya village, uttar pradesh, kushboo refused to marry omveer

A marriage was called off after the bridegroom failed to count beyond nine and answer mathematical questions posed by the bride.

పెళ్లీపీటలపై వరుడికి పరీక్ష.. పెళ్లికి నిరాకరించిన వధువు

Posted: 12/11/2015 10:49 AM IST
Bride calls off marriage after groom fails math test

పెళ్లీ పీటలపైనున్న వరుడికి వదుపు పరీక్ష పెట్టింది. తాను టెస్టులో పాస్ కాకపోవడంతో.. తేగించి పెళ్లీపీటల పైనుంచి లేచి వచ్చేసింది. తనకు కాబోయే భర్తకు కనీస లెక్కలు కూడా తెలియని అజ్ఞానిని, నిరక్ష్యరాస్యుడని..తెలుసుకున్న వధువు.. తాను వివాహం చేసుకునేది లేదంటూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన యూపీలోని మణిపురి జిల్లాలోని గులారియాపూర్ గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, కుష్బూ అనే యువతికి, ఓంవీర్ అనే యువకుడికి పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహం వైభవంగా మొదలైంది. వేడుకలో భాగంగా మంత్రాలను ఉచ్చరించాలని పురోహితుడు చెప్పినప్పుడు, వాటిని వరుడు సరిగ్గా పలకలేకపోవడంతో వధువుకు తొలి అనుమానం వచ్చింది. మరో పావుగంటలో మొత్తం తతంగమంతా పూర్తవుతుందనే సమయంలో, కొన్ని నాణాలను ఇచ్చి లెక్క పెట్టమంటే, తొమ్మిది తరువాత ఎంతో అతనికి తెలియలేదు. ఆపై మొబైల్ ఫోన్ చేతికిచ్చి తన నంబర్ చెప్పి డయల్ చేయాలని కోరగా, ఆ పని కూడా చేయలేకపోయాడు.

ఇక 69, 79 మధ్య తేడా ఎంతని ప్రశ్నించగా, తెల్లమొహమే సమాధానమైంది. ఇక ఓంవీర్ తనకు వద్దంటూ కుష్బూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఓంవీర్ కు ఆ వెంటనే గంటల వ్యవధిలో మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. కా.గా, కుష్బూకు ఆమె తల్లిదండ్రుల నుంచి, ఊరి పెద్దల నుంచి మద్దతు లభించింది. వరుడి విద్యార్హతలపై తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని, నిరక్షరాస్యుడు మాత్రమే కాకుండా, అతనికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయని, ఈ పెళ్లి తప్పిపోవడం తమకు బాధను కలిగించలేదని కష్బూ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. 8వ తరగతి వరకూ చదువుకున్న కుష్బూకు మరింత చదివి ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్నది కోరికట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bride  bridegroom  smart phone  maths  uttar pradesh  

Other Articles