వరద అని మూడు అక్షరాల్లో రాసినంత కాదు చెన్నైలో వచ్చిన విలయం.. అక్కడి వరద తమిళులు స్థితిగతులను మార్చివేసింది. నిన్న మొన్నటివరకూ మెట్రో నగరంలో అలరారిన చెన్నై మహా పట్టణం ఇప్పుడు ప్రకృతి కన్నెర్రతో చిన్నబోయింది. విపత్తు చేసిన విధ్వంసంతో చెన్నై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్న చిన్న విషయాలకు వారు పడుతున్న అవస్థలు తీవ్రంగా ఉన్నాయి. గత ఐదు రోజులుగా విద్యుత్తు సౌకర్యం లేకపోవటం అన్నింటికి మించిన పెద్ద సమస్య అయితే.. చుట్టూ నీళ్లున్నా.. తాగేందుకు.. కనీస అవసరాల కోసం నీరు దొరకని దుస్థితి. అయితే చెన్నై పరిస్థితిని అర్థం చేసుకున్న మానవతావాదులు చెన్నైకి చేయూతనందించేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా ఎవరికి తోచినంతలా వారు తమ శక్తిమేరకు సహాయం చేస్తున్నారు. అయితే అలా సహాయాన్ని అందిస్తున్న వారిలో సేవ ఇంటర్నేషన్ (Sewa International) పేరును ప్రముఖంగా చెప్పుకోవాలి. చెన్నై విలయం గురించి ఎంత రాసినా కానీ తక్కువే.. అక్కడ జరిగిన నష్టం.. అక్కడి పరిస్థితి అక్కడ ఆ ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.చెన్నై వదరలల్లో 20 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 2500 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. తమిళనాట వచ్చిన వరదల కారణంగా దాదాపుగా 300 మందికి పైగా ప్రాణాలు వదిలారు. అయితే మిగిలిన వారి పరిస్థితి అత్యతం దారుణంగా మారింది. అయితే చెన్నైకి చేయూత నిస్తూ చాలా సంస్థలు ముందుకు వచ్చినా.. సేవా భారతి, ఏబీవీపీతో కలిసి సేవ ఇంటర్నేషన్ చేసిన సేవ ప్రశంసనీయం. దాదాపు నాలుగు వేల మంది వాలంటీర్లతో సుమారుగా 1.1 మిలియన్ మందిని వరద నుండి కాపాడింది. వరద కారణంగా మొత్తంగా 3 బిలియప్ డాలర్ల నష్టం వాటిల్లగా.. అందులో చెన్నై నగరంలొనే 1 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
చెన్నైకి చేయూతగా ఏపి, కర్ణాటక నుండి టన్నుల కొద్దీ ఆహారం, నీళ్లు, రైస్, దోమతెరలు, క్లీనింగ్ వస్తువులైన ఫినైల్, మగ్గులు, బ్రష్ లు, బకెట్లు, బ్లీచింగ్ పౌడర్ లు చాలా మంది డొనేట్ చే:శారు వీటిని సేవా వాలంటీర్లు కుడలూర్, చిదంబరం, చెన్నైలలో పంపిణీ చేశారు. సేవ వరద సహాయం కోసం వాలంటీర్లతో కొన్ని టీంలను రంగంలోకి దింపింది. దాంతో వారు వరద సహాయాన్ని మరింత ముమ్మరంగా అందించగలిగారు. వరద బాధితుల కొసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వస్తువులను పంపిణీ చేయగలిగారు.
చెన్నై విలయం గురించి ఎంత రాసినా కానీ తక్కువే.. అక్కడ జరిగిన నష్టం.. అక్కడి పరిస్థితి అక్కడ ఆ ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది.చెన్నై వదరలల్లో 20 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 2500 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. తమిళనాట వచ్చిన వరదల కారణంగా దాదాపుగా 300 మందికి పైగా ప్రాణాలు వదిలారు. అయితే మిగిలిన వారి పరిస్థితి అత్యతం దారుణంగా మారింది. అయితే చెన్నైకి చేయూత నిస్తూ చాలా సంస్థలు ముందుకు వచ్చినా.. సేవా భారతి, ఏబీవీపీతో కలిసి సేవ ఇ:టర్నేషనల్ సంస్థ చేసిన సేవ ప్రశంసనీయం. దాదాపు నాలుగు వేల మంది వాలంటీర్లతో సుమారుగా 1.1 మిలియన్ మందిని వరద నుండి కాపాడింది. వరద కారణంగా మొత్తంగా 3 బిలియప్ డాలర్ల నష్టం వాటిల్లగా.. అందులో చెన్నై నగరంలొనే 1 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
చెన్నై వరద బాధితుల కోసం ఎంతో మంది ముందుకు వచ్చారు. అలా చెన్నైకి సాయం చేద్దామని రంగంలోకి దిగిన రత్నేష్ మిశ్రా( అరిజొనా) కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఓ ట్వీట్ ఆధారంగా తన టీంతో కలిసి ఆమెను రక్షించారు. ఆమె పండంటి కవవలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు కూడా క్షేమంగా ఉన్నారు. ఇలా ఒక్కరిద్దరిని కాదు చాలా మందిని సేవ ఇంటర్నేషనల్ వాలంటీర్లు రక్షించారు.
చెన్నైకి చేయూతగా ఏపి, కర్ణాటక నుండి టన్నుల కొద్దీ ఆహారం, నీళ్లు, రైస్, దోమతెరలు, క్లీనింగ్ వస్తువులైన ఫినైల్, మగ్గులు, బ్రష్ లు, బకెట్లు, బ్లీచింగ్ పౌడర్ లు చాలా మంది డొనేట్ చే:శారు వీటిని సేవా వాలంటీర్లు కుడలూర్, చిదంబరం, చెన్నైలలో పంపిణీ చేశారు. సేవ వరద సహాయం కోసం వాలంటీర్లతో కొన్ని టీంలను రంగంలోకి దింపింది. దాంతో వారు వరద సహాయాన్ని మరింత ముమ్మరంగా అందించగలిగారు. వరద బాధితుల కొసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వస్తువులను పంపిణీ చేయగలిగారు.
సేవ వాలంటీర్లు వరద బాధితుల కోసం.. ఆహార పొట్లాలను తయారుచేసి, వాటిని చూళైపాలెం, డాక్టర్ కను నగర్, చెట్ పేట్, మైలాపోర్ లలో పంపిణీ చేశారు. ఒక ఏరియాలో ఒక్క రోజులోనే 1700 ఫుడ్ ప్యాకెట్లు, 100 బిస్కెట్ ప్యాకెట్లు, 400 400 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరద బాధితుల అవసరాలను తీర్చేందుకు సేవ ట్రస్టు వాళ్లు చేసిన కృషి, పడ్డ కష్టాన్ని ఎవరూ మరిచిపోలేరు. అశోక్ నగర్, మనబాలమ్ లోని హనుమాన్ దేవాలయంలో వరద బాధితుల కోసం వంటలు వండించింది సేవ ట్రస్టు. తమ వాలంటీర్ల ద్వారా వాటిని ఆకలితో ఉన్న వారికి అందించింది. దాదాపు 2000 మందికి ఇలా రెండు పూటల ఆహారాన్ని అందించారు సేవ వాలంటీర్లు.
ఆకలితో ఉన్న వాడి ఆకలిని తీర్చడం..
ఆపదలో ఉన్న వాడిని ఆదకోవమే మానవత్వం - ఇదే సూత్రాన్ని చెన్నై వదర బాధితుల విషయంలో సేవ ఇంటర్నేషనల్ పాటించి.. మానవతను చాటింది.
వరద సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు అయితే దాని ప్రభావం అక్కడ ఉంటున్న వారి మీద కనినపించింది. చాలా మంది వివిధ రోగాల బారిన పడ్డారు. తాగే నీళ్లు కలుషితం కావడంతో చాలా మందికి రోగాలు వచ్చాయి. అందులో చాలా మంది యువకులు ఉండటంతో పరిస్థితి దారుణంగా మారింది. సేవ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 50 మంది డాక్టర్లు, 12 మంది మెడికల్, ఫార్మసీ స్టూడెంట్స్ కలిసి చెన్నైలో మెడికల్ ట్రీట్ మెంట్ కు ముందుకు వచ్చారు. పది టీంలుగా ఏర్పడి 40 క్యాంపులు నిర్వహించారు లక్ష మందిని పరీక్షించి వారికి కావాల్సిన మందులు, ట్రీట్ మెంట్ అందించారు. చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంతో హెల్త్ క్యాంపుల్లో చాలా వరకు ఆయుర్వేద మహా సుదర్శన ట్యాబెట్ వేసుకోండని సూచించారు.
వేల మంది వాలంటీర్లు చెన్నై నలుదిక్కుల వదర బాధితుల కోసం అహర్నిశలు కృషి చేశారు. వరద బాధితులకు తమవంతు స్వాంతన అందించేందుకు సేవ ఎంతో విశేష ప్రయత్నం చేసింది. ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ ధెరిస్సా సిద్దాంతాన్ని సేవ చాటింది. చెన్నైలో వచ్చిన వరదకు తక్షణ సహాయంగా సేవా ఇంటర్నేషనల్ 25 వేల డాలర్లు విడుదల చేసింది. అయినా కానీ పరిస్థితిలో మార్పు రాకపోవడం. చెన్నై చితికిసపోవడంతో ఐదు రోజుల్లో 90 వేల డాలర్లతో సేవ చేసింది. చెన్నై కుదుట పడేంత వరకు సేవ ఇంటర్నేషనల్ మరిన్ని నెలలపాటు తన సేవలను అందించనుంది.
స్వయంగా సాయం చెయ్యడానికి వీలు కావచ్చు... కాకపోవచ్చు. కానీ మనకు చెన్నైని ఆదుకోవాలనే కోరిక మాత్రం ఉంటుంది. అలాంటి వారికి సేవ ఇంటర్నేషనల్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ సంస్థ చేస్తున్న సహాయ కార్యక్రమాలను మరింత విస్తరించడానికి ఆర్థిక సహాయాన్ని కోరుతోంది. సమాయం చెయ్యాలనుకున్న వారు సేవ ఇంటర్నేషనల్ ద్వారా తమ ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. సహాయం అందించాలనుకున్న వారు https://www.sewausa.org/donate ద్వారా తమ చేయూతనందిచవచ్చు. డొనేషన్ ఇస్తున్న వారికి ట్యాక్స్ రిలాక్సేషన్ కూడా ఉంది. చెక్కు ద్వారా అందించాలనుకున్న వారు Sewa International అనే పేరుతో రాసి, దాన్ని సేవ ఇంటర్నేషనల్, పోస్ట్ బాక్స్ నెంబర్ 820867, హౌస్టన్, టెక్సాస్ 77282-0867 (Sewa International, P O Box 820867, Houston, TX 77282-0867)కు పంపించగలరు.
వందకు వంద శాతం డొనేషన్లు తమిళనాడు వదర బాధితుల కోసం వాడుతామని.. ఒక్క రూపాయి కూడా వృధా కాదు- శ్రీ శ్రీనాధ్, సేవ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్
డొనేషన్స్ చెయ్యాలనుకున్న వారు ఇక్కడ క్లిక్ చెయ్యండి(https://www.sewausa.org/donate)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more