Chennai rains bring new superstitious beliefs to house owners

New superstitious beliefs surrounds in chennai

Chennai rains superstitious beliefs, Chennai rains, house owners superstitious beliefs in Chennai, Chennai rains, tamilnadu news, Chennai rains superstitious beliefs, Chennai rains, Tamilnadu rains

The house owners in Chennai, believe a strange superstious beliefs,targeting the Chennai rains and are currently being threatened of it.

చెన్నైలో యమధర్మారాజు.. ప్రజల్లో తెలియని భయాందోళనలు

Posted: 12/10/2015 12:13 PM IST
New superstitious beliefs surrounds in chennai

ఏకధాటిగా కురిసిన వర్షాలు, ఉదృతంగా ఇళ్లను సముద్రాన్ని ఏకం చేస్తూ ప్రవహించిన వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు ప్రజలకు కొత్త కొత్త భయాలు పుట్టుకు వస్తున్నాయి. యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతుపై వచ్చి చెన్నైలోని ఇంటి యజమాని ప్రాణాలను లాక్కెళ్తాడన్న ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఈ ప్రచారం అందరినీ భయపెడుతోంది. ఇక మహిళలు తమ పసుపు కుంకాలు కాపాడుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ప్రత్యేక పూజలు ఎలా చేయాలో చెబుతూ అవి ఎలా ఉండాలో సూచిస్తున్న సమాచారమూ చక్కర్లు కొడుతోంది. వీటిని చూసిన మహిళలు అలాగే చేస్తూ, తెల్లవారుఝామునే నిద్ర లేచి, ఇంటి బయట ముగ్గులతో అలంకరించి, ప్రత్యేక దీపాలు పెడుతూ, ఆపై ఆంజనేయుని ఆలయాలకు భర్తలను తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ యముడు మాత్రం ఎక్కడ కనబడలేదుగానీ, హడావుడి మాత్రం బాగానే ఉంది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మి భయపడవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai rains superstitious beliefs  Chennai rains  Tamilnadu rains  

Other Articles