ISIS posts propaganda song in Mandarin to recruit Chinese Muslims

Isis posts propaganda song in mandarin to recruit chinese muslims

ISIS, China, Son, ISIS SOng in China, China Muslims, ISIS Recruit

Islamic State militants (IS, formerly ISIS/ISIL) have reportedly published a propaganda song in Mandarin to attract attention of Chinese Muslims. This comes amid Beijing’s calls to strengthen international cooperation against terrorism. The four-minute song in form of ‘nasheed,’ an Islamic a cappella chant, emerged online on Sunday, according to the SITE Intelligence Group, which monitors and tracks jihadist groups online.

చైనాను వణికిస్తున్న ‘వాళ్ల’ పాట

Posted: 12/09/2015 08:40 AM IST
Isis posts propaganda song in mandarin to recruit chinese muslims

ఐఎస్ఐఎస్ పారిస్ పై దాడులు నిర్వహించి పారిస్ ప్రజలను వణికించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పడు తాజాగా ఐఎస్ఐఎస్ కన్ను మరో అగ్రరాజ్యమైన చైనాపై పడింది. చైనాలో తమ పట్టు, బలం పెంచుకోవాలనే నేపథ్యంలో జిహాదాలజీ అనే వెబ్ సైట్ లో నాలుగు నిమిషాల పాటను పోస్ట్ చేసింది. చైనాలోని ముస్లింలను ఉద్దేశించి 'ఐ యామ్ ముజాహిద్' అనే పాటను షేర్ చేసింది. 'యుద్ధభూమిలో అమరులవ్వాలనే మన కలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది.. అంటూ సాగే ఈ పాట చైనా ప్రజల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా చైనాలో టీచర్ గా పనిచేస్తున్న ఫాన్ జింగ్ హుయ్ ను గతంలో ఇస్లామిక్ స్టేట్ కిడ్నాప్ చేసి హతమార్చిన తర్వాత చైనా తన వైఖరిని మార్చుకుంది.

ఈ తాజా వ్యవహారంతో చైనా చిటపటలాడుతోంది. ఇది ఇలా ఉండగా… ఐఎస్ఐఎస్ తన పరిధిని విస్తరించుకునే పనిలో భాగంగానే ఈ చర్యకు పూనుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా చైనా ప్రభుత్వం తాజా ఐఎస్ఐఎస్ చర్యలతో వణికిపోతోంది. చైనాలో పాగా వేసేందుకు ఆ ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు ఖచ్చితంగా దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని భద్రతా బలగాలు గట్టిగా నమ్ముతున్నాయి. దాంతో ఐఎస్ ను ఎలా కట్టడి చెయ్యాలన్న దాని మీద చైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఐఎస్ లోకి ఎవరూ చేరకుండా ఎలా అడ్డుకోవాలన్నదాని మీద కూడా చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  China  Son  ISIS SOng in China  China Muslims  ISIS Recruit  

Other Articles