India Beat Netherlands in Shootout to Win Historic Bronze

India beat netherlands in shootout to win historic bronze

Indian, Hockey, Hockey Match, Hockey match with Netherlands, India Beat Netherlands, Indian Hockey team wins Bronze

India avenged their 3-1 defeat to Netherlands in pool games to come out victorious in the third-place playoff in the FIH Hockey World League Final. It was also a come-from-behind win for India as they claimed their first medal at a major FIH event after 33 years.

భారత హాకీ జట్టు అద్భుత విజయం

Posted: 12/07/2015 08:34 AM IST
India beat netherlands in shootout to win historic bronze

వరల్డ్ హాకీ లీగ్ ఫైనల్ లెగ్‌లో భారత హాకీ జట్టు అద్భుత విజయంతో కాంస్య పతకం కైవసం చేసుకుంది. 33 ఏండ్ల తర్వాత అంతర్జాతీయస్థాయిలో ఓ పెద్ద టోర్నీలో పతకం..బలమైన ప్రత్యర్థి నెదర్లాండ్స్‌పై పోరాడి కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు పునరాగమనంపై అభిమానుల్లో ఆశలు పదిలంగా ఉంచింది. భారత హాకీ జట్టు మూడోస్థానం కోసం జరిగిన పోరులో పటిష్ఠమైన నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. తొలుత నిర్ణీత సమయం ముగిసేవరకు ఇరు జట్లు 5- 5 గోల్స్ తేడాతో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో భారత్ 3-2 ఆధిక్యంతో డచ్ టీమ్‌ను చిత్తు చేసి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆట ప్రారంభ నిమిషాల్లోనే పటిష్ఠమైన నెదర్లాండ్స్ ప్లేయర్స్ దూకుడు ప్రదర్శించారు. భారత డిఫెన్స్ బలహీనతలను ఆసరా చేసకుని తొలి అర్ధభాగంలోనే 2 గోల్స్ చేశారు.

ఎంతో కాలంగా భారత హాకీ జట్టు విజయం కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూసి అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరింది. హాకీ ఆటకు బారత్ ఇంకా చరమగీతం పాడలేదని నిరూపించింది. ముందు నుండి అటు ఇటుగా దూసుకెళ్లిన సర్దార్ సేన చిరవకు నెదర్లాండ్ టీంను ఓడించింది. కాగా ఈ మ్యాచ్ లో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడగా నిలబడి భారత్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 3-2 ఆధిక్యంతో నెదర్లాండ్స్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles