Homeless Couple Found Living In Walmart Attic With Hot Plate, Meth Lab, And 42″ LED TV

Homeless couple living above walmart store for 2 years

homeless couple found living in walmart attic with hot plate, Wilbert Thomas, Ingrid Malone, meth lab, led tv, living in the lap of luxury, Tennessee Walmart store, store employees, police, homeless couple, Tennessee, Walmart,

Tennessee couple who had been “living in the lap of luxury” above a Tennessee Walmart store.

సోంతగూడు లేక ఇలా చేస్తే.. శృంగారం గుట్టు రట్టు చేసింది..

Posted: 12/06/2015 03:52 PM IST
Homeless couple living above walmart store for 2 years

అవకాశం దొరికితే ఇలా కూడా బతకొచ్చని ఓ సీనియర్ ప్రేమ జంట ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రేమికులైన విల్‌బర్ట్ థామస్ (48), తన కంటే పెద్దదైన తన ప్రియురాలు ఇంగ్రిడ్ మలోన్ (54) కలిసి ఏకంగా వాల్‌మార్ట్ కాంప్లెక్స్‌లోని ఒక అటకమీద కాపురం పెట్టారు. అందులోనే రెండేళ్ల పాటు సహజీవనం చేశారు. అక్కడ వీళ్లు చేసుకున్న సెటెప్‌ను చూస్తే ఎవరైనా అదిరిపోతారు. ఆ చిన్నపాటి చోటులో బిగ్ స్క్రీన్ టీవీ, మినీ రిఫ్రిజిరేటర్, హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్, బెడ్ రూమ్ సెట్, హాంగర్స్ లాంటి భారీ సెటప్ ఉంది. మరో అడుగు ముందుకేసి శాటిలైట్ టీవీ వైర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు టికెట్ కూడా బుక్ చేశారు.
 
రెండేళ్లకు పైగా సాగిన వీరి రహస్య సంసారం ఒక రోజు అనుకోకుండా వాల్‌మార్ట్ సిబ్బంది కంటపడింది. వాల్‌మార్ట్ కాంప్లెక్స్‌లోని బ్రేక్ రూమ్‌లో సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు పై నుంచి శబ్ధం రావడంతో వారు పైకి ఎక్కి చూశారు. చిన్న బెడ్‌పై ఆ ప్రేమికుల జంట సరససల్లాపాలు సాగిస్తుండడం చూసి వాల్‌మార్ట్ సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. వారి నిర్వాకాన్ని సంస్థ యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ప్రేమ జంటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : homeless couple  Tennessee  Walmart  Wilbert Thomas  Ingrid Malone  

Other Articles