2 teachers suspended for sexually harassing girl students

2 teachers sexually harassing girl students

sex, sexually harassing, abuse, Pudukottai, Namana Samuthiramnear, Ravichandran (50) and Ponnarasan Chief Education officer C Santhi, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

Two teachers of an aided school at Namana Samuthiramnear were put under suspension for sexually harassing two girls.

కీచక గురువులు.. విద్యార్థినులపై లైంగిక వేధింపులు

Posted: 12/05/2015 12:17 PM IST
2 teachers sexually harassing girl students

భారతీయ సమాజంలో గురువుకు తల్లిదండ్రులు తరువాత స్థానం ఇస్తాం. గురువును దేవుడితో సమానంగా పూజిస్తాం. అలాంటి గురుస్థానంలో వున్న ఇద్దరు గురువులు.. ఆ స్థానానికే అపఖ్యాతి తీసుకోచ్చేలా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా తమ వద్ద విద్యాబుద్దులు నేర్చుకుంటున్న ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయినా తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించారు. ఈ ఘటన తమిళనాడుతోని పుదుకో్ట్టైలో జిల్లాలో జరిగింది.

జిల్లాలోని నమన సముత్తిరంన్నీర్ పట్టణంలో గల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు రవిచంద్రన్ (50), పొన్నారసన్ (45) అనే ఇద్దరు ఉపాధ్యాయులు వేర్వేరుగా ఇద్దరు విద్యార్థునులపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. భాదిత విద్యార్థినుల్లో ఒకరు తొమ్మిదవ తరగతి చదువుతుండగా, మరోకరు పదో తరగతి అభ్యసిస్తున్నారు. కాగా తమకు జరిగుతున్న లైంగిక దాడులపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పిర్యాదు చేశారు. అయితే వారి ముందు ఉపాధ్యాయులను పిలిచి ప్రశ్నించగా, తాము ఎలాంటి తప్పు చేయలేదని వారు బుకాయించారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు.. పాఠశాలకు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో అందోళన కార్యక్రమాలు చేశారు. పాఠశాలు ఎదురుగా ధర్నా నిర్వహించి.. రాస్తారోకో చేయడంతో పాఠశాల కమిటీ సభ్యులు భేటీ అయి చర్చించి ఉపాధ్యాయులపై చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ప్రధాన విద్యాశాఖ అధికారి సి శాంతి ఇరువురు ఉపాధ్యాయులను సస్సెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexually harassment  Teachers  students  suspension  

Other Articles