Flipkart suffers Rs 2000-crore loss in discount war

Flipkart reports a loss of rs2 000 crore in fy15

Flipkart, Loss, E-commerce, Discounts, Snapdeal, Flipkart discount war, Flipkart loss, Flipkart Rs2,000 crore loss, Flipkart discount war loss, Discounts, Snapdeal, Amazon, Warehouses

Two main entities controlled by Flipkart reported a loss of about Rs2,000 crore in the year ended March, up from a loss of Rs715 crore in the previous year

ఫ్లిప్ కార్ట్ కు నష్టాలు.. డిస్కౌంట్ వార్ లో బొర్లాపడిన ఈ కామెర్స్ దిగ్గజం

Posted: 12/04/2015 09:02 AM IST
Flipkart reports a loss of rs2 000 crore in fy15

భారతీయులు డిస్కౌంట్లు ప్రకటిస్తే అవసరం వున్నా లేకున్నా.. అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారని గ్రహించిన ఈ కామర్స్ సైట్లు ఎడా పెడా డిసౌంట్ ఆపర్లు ప్రకటించి భారత్ నుంచి పెద్ద మొత్తంలో కరెన్సీని లాగేసుకున్నామని సంభరపడిన ఈ-కామర్స్ సంస్థంలు ఇప్పుడు లబోదిబో మంటున్నాయి. భారతీయులు డిస్కౌంట్ ఆపర్లను ఎలా ఎంచుకుని తీసుకుంటారో తెలిసి వచ్చిన సంస్థలు చేతులు కాలిన తరువాత అకులు పట్టుకుంటున్నాయి.

ఈ కామెర్స్ రంగంలో అనతి కాలంలో దిగ్గజ కంపెనీగా ఎదిగిన ఫ్లిప్ కార్ట్ గతేడాది ఆఖరు త్రైమాసికంలో భారీగా నష్టాలు చవిచూసింది. అప్పటిదాకా లాభాలతో పరుగులు పెట్టిన ఈ సంస్థ గతేడాది ఆఖరు క్వార్టర్ కు సంబంధించి భారీ నష్టాలతో సతమతమైంది. అయినా వినూత్న ఆపర్లతో భారీ సంఖ్యలో కొనుగోళ్లకు కేంద్రంగా నిలిచిన ఫ్లిప్ కార్ట్ నష్టాలు వచ్చాయంటే నమ్మడం అసాధ్యమే. అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు ఆ సంస్థ సమర్పించిన పత్రాల్లోనూ సదరు నష్టాలు స్పష్టంగా కనిపిస్తుంటే, నమ్మక తప్పడం లేదు.

గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫ్లిప్ కార్ట్ కు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందట. దీనికంతటికీ కారణమేంటంటే... అడక్కున్నా భారీ ఆపర్లంటూ హోరెత్తిన ప్రచారమే.  ఈ-కామర్స్ రంగంలో సత్తా చాటేందుకు భారీ డిస్కౌంట్లు ఇవ్వక తప్పడం లేదు. ఫ్లిప్ కార్ట్ కూడా అదే చేసింది. అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉత్పత్తిదారుడు ఇచ్చే రిబేటుతో పాటు ఫ్లిప్ కార్డ్ కూడా కొతమేర సబ్సీడీ ఇచ్చింది. ఈ కారణంగానే ఫ్లిప్ కార్టకు నష్టాలు వచ్చాయట. ఈ నష్టంలో ఫ్లిప్ కార్ట్ ఇంటర్నెట్ఖ పోర్టల్ కు రూ.1,096 కోట్ల నష్టం రాగా, హోల్ సేల్ అనుబంధ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇండియాకు రూ.836. కోట్ల మేర నష్టం వాటిల్లిందట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Flipkart  Loss  E-commerce  Discounts  Snapdeal  

Other Articles