Modi announces relief of Rs 1000 crore for rain-hit Tamil Nadu

Pm modi in rain hit chennai announces immediate relief of

Chennai rains, Relief and rescue operations in Chennai, NDRF, Met department, PM Narendra modi, Aerial survey, Jayalalitha, Chennai floods areas, Roshaiah

PM Modi has instructed the central government to immediately release Rs 1,000 crore for relief and rescue operations in rain-hit Tamil Nadu

తమిళనాడుకు వెయ్యి కోట్ల తక్షణ సాయం.. ఏరియల్ సర్వే తరువాత మోడీ ప్రకటన

Posted: 12/03/2015 07:40 PM IST
Pm modi in rain hit chennai announces immediate relief of

భారీ వరదలతో అతలాకుతలమైన  చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు.  ప్రత్యేక విమానంలో వేలూర్‌, రాజాలి ఎయిర్‌బేస్‌కు చేరుకున్న మోదీ, వరద నష్టంపై ఎయిర్‌పోర్టులో అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌లో ఫొటోలను ఆయన పరిశీలించారు. వరదలో వాటిల్లిన నష్టంపై ఆరా తీశారు. ఏరియల్ సర్వే అనంతరం నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితో భేటీ అయ్యారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.

అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా చెన్నై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 269మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aerial survey  Jayalalitha  PM Narendra modi  Chennai floods areas  

Other Articles