Chennai Rains Break Hundred Year Record, Wreak Havoc

Chennai drowns in deluge of water flight services suspended

chennai rain, rain chennai, Chennai waterlogging, Chennai floods, chennai rainfall, tamil nadu rain, chennai news, chennai airport, chennai flight services suspended, india news, latest news, india news, rains in chennai

Many parts of Chennai and its suburbs are flooded after two days of heavy and continuous rain. Flight operations have been indefinitely suspended at the airport

చెన్నైలో కుండపోత.. నగరవాసి గుండె కోత.. విమానాయశ్రం సర్వీసులు బంద్..

Posted: 12/02/2015 08:13 AM IST
Chennai drowns in deluge of water flight services suspended

తమిళనాడులో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న కురిసిన భారీ వర్షాలకు ఆ రాష్ట్ర రాజధాని చెన్నై సహా పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా రెండు రోజుల క్రితం నుంచి మరోమారు భారీ వర్షం చెన్నై నగరంతో పాటు పరిసర జిల్లాలను సైతం ముంచెత్తింది. ఫలితంగా చెన్నై నగరం జలసంద్రంగా మారింది. నగరంలోని మెజారిటీ కాలనీలు నీట మునగగా, నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని భవనాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

భారీ వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు కాగా, ఏకంగా చెన్నై ఎయిర్ పోర్ట్ మూతపడింది. రన్ వే పూర్తిగా నీట మునిగింది. నిన్న రాత్రికే 9 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాశ్రయం నుంచి సర్వీసులను ఎప్పుడు పునరిద్దరిస్తారన్న విషయం ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. వర్షం వెలిసిన తరువాత రన్ వే పై నీళ్లు తొలగించిన తరువాత గానీ సర్వీసులు పున:ప్రారంభం కావని చెప్పారు. ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫోన్ చేశారు. వర్ష బీభత్సంపై ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడంతో పాటు అండగా ఉంటామని ఆయన జయలలితకు భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని  సూచించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Chennai rains  Chennai waterlogging  Chennai floods  

Other Articles