Shootout between police and kidnappers in Ghaziabad school over abduction of teenager

Playschool turns into warzone in ghaziabad kidnapped teen rescued

Ghaziabad school firing, Jaikaran kidnap, Ghaziabad kidnapping, Encounter in school, Bitoo, Deepak, Karan Mahajan, kidnappers, Sandeep, Sihani Gate police, SP Ajay Pal Sharma

A gun battle ensued in a school between police and a group of kidnappers in Ghaziabad after a teenager was taken hostage.

ITEMVIDEOS: గజియాబాద్ లో కాల్పుల కలకలం.. పోలీస్ వర్సెస్ కిడ్నాపర్స్..

Posted: 12/01/2015 01:53 PM IST
Playschool turns into warzone in ghaziabad kidnapped teen rescued

అది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నగరం. ఇవాళ ఉదయం అక్కడ ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. తుపాకులు చేతబట్టిన ముగ్గురు కిడ్నాపర్లు అక్కడి ఓ పాఠశాలలోకి చొచ్చుకెళ్లారు. వారితో ఒ టీనేజ్ అబ్బాయి కూడా వున్నాడు. పాఠశాలలో వున్నవిద్యార్థులు, టీచర్లును చూసి కూడా.. పట్టించుకోని సదరు కిడ్నాపర్లు ఓ తరగతి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. అక్కడి నుంచి బాలిక తండ్రికి ఫోన్ చేసిని కిడ్నాపర్లు తమ డిమాండ్ మేరకు రెండు కోట్ల రూపాయలు ఇస్తేనే.. వారి బాలుడిని వదిలేస్తామని లేదంటే.. తమ బాలుడిని చంపేస్తామని హెచ్చరించారు.

ఊహించని ఘటనతో తొలుత షాక్ తిన్న బాలుడి తండ్రి ఆ తర్వాత వేగంగా స్పందించారు. వెనువెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిపోయిన పోలీసులు పాఠశాలను రౌండప్ చేశారు. క్షణాల్లో లోపలకు చొచ్చుకు వెళ్లి, కిడ్నాపర్లు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టారు. కిడ్నాపర్లు తేరుకునేలోగానే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారి చేతుల్లోని తుపాకులు లాగేశారు. వెనువెంటనే కిడ్నాపర్ల చేతులకు బేడీలు వేశారు. ఆపై నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో బాలుడికి చిన్నపాటి గాయం కూడా కాలేదు.

అనంతరం కిడ్నాప్ కు సంబంధించిన వివరాలను గజియాబాద్ ఎస్ పీ అజయ్ పాల్ శర్మ వివరిస్తూ.. బాలుడి కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు బిట్టూ, దీపక్, సందీప్ లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలుడితో స్నేహపూర్వకంగా మెలగడం కోసం అంతకుముందు వారి ప్రణాళికలో భాగంగా అతడితో క్రికెట్ అడారని చెప్పారు. ఈ నెల 29న బాలుడిని కిడ్నాప్ చేశారని, కాగా వారి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేయడంతో పాటు స్థానికులను వారి గురించి ఎప్పటికప్పుడు విచారించడంతో బాలుడిని సురక్షితంగా వారి నుంచి కాపాడగలిగామని శర్మ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bitoo  Deepak  Karan Mahajan  kidnappers  

Other Articles