Duplicate Rice in Market

Duplicate rice in market

Suplicate Rice, Plastic Rice, Rice, Hyderabad, China, Plastic Rice from China

Duplicate rice from china found in Hyderabad. A customer found plastic rice in his rice bag. China suppying plastic rice to all countries.

జాగ్రత్త: మార్కెట్లో కల్తీ బియ్యం

Posted: 12/01/2015 08:14 AM IST
Duplicate rice in market

కల్తీ నూనె, కల్తీ మసాలాలు, కల్తీ పాలు ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతున్నప్పుడు బియ్యంలో మాత్రం కల్తీ ఉండదా ఏంటి..? అవును మార్కెట్లోకి కల్తీ బియ్యం కూడా వచ్చాయి. కల్తీ బియ్యం అంటే బియ్యంలో రాళ్లు ఉండటంలాంటిదని అనుకుంటున్నారేమో అస్సలు కాదు. అసలు మ్యాటర్ ఏంటో మీరే చూడండి. హైదరాబాద్ లో కల్తీ బియ్యం ఘటన కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ సూపర్ స్టోర్ కు వెళ్లి బియ్యం కొన్న కస్టమర్ కు షాక్ కొట్టినంత పని అయింది. అతను కొనుగోలు చేసిన 25కిలోల బియ్యం బస్తాలో ప్లాస్టిక్ రైస్ మిక్స్ చేశారు. ఇంటికి తీసుకొచ్చి ఉడికేస్తే కాని అసలు విషయం అర్థం కాలేదు. ఆ బియ్యం ఎంతసేపటికి ఉడకదు, అన్నం కాదు. చివరకు అవి నకిలీ బియ్యం అని, అందులో ప్లాస్టిక్ రైస్ కలిపారని తెలుసుకున్న ఆ వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన నగరవాసుల్లో ఆందోళన నింపింది. కాగా ఆ ప్లాస్టిక్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే.. చైనా నుంచి అని తెలుస్తోంది.

దీంతో ఇప్పుడు చర్చంతా చైనా బియ్యం గురించే జరుగుతోంది. అసలు చైనా బియ్యం అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారు, వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది..ఇలాంటి ఎన్నో సందేహాలు నగరవాసుల బుర్రని తొలిచేస్తున్నాయి. చైనాలో తయారవుతున్న ప్లాస్టిక్ రైస్ అక్రమ మార్గాల్లో మన దేశంలోకి వచ్చి పడుతున్నాయి. అచ్చంగా బియ్యంలా కనిపించే ప్లాస్టిక్ గింజల్ని నిజమైన బియ్యంలో కలిపి అమ్మేస్తున్నారు అక్రమార్కులు. పైగా ఈ ప్లాస్టిక్ బియ్యం నిజమైన బియ్యంకంటే చాలా నిగనిగలాడుతుంటాయి. ఎలా అంటే చూస్తేనే కొనాలన్నంతగా. కానీ వాటిలో హానికరమైన కెమికల్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ ప్లాస్టిక్ రైస్ తయారీ కోసం చిలకడ దుంప, ఆలుగడ్డలతో పాటు ఒక రసాయనిక రెసిన్ను కలిపి, ఆ మిశ్రమాన్ని బియ్యం రూపంలో అచ్చు వేస్తారు. వీటి తయారీలో వాడే కొన్ని రకాల ఎడిబుల్ సింథటిక్ రెసిన్స్ కారణంగా ఆ గింజలు మామూలు బియ్యం లాగానే ఉడుకుతాయని, కానీ తింటే ప్లాస్టిక్ రుచి తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suplicate Rice  Plastic Rice  Rice  Hyderabad  China  Plastic Rice from China  

Other Articles