Special contact lenses that change the curve in the eye

Special contact lenses that change the curve in the eye

contact lenses, Special contact lenses, Eyes, Eye sight, US, the Advances in Ophthalmology And Visual Systems, Vision

could be used like 'braces' to slow the development of short sightedness in children. Findings published in published in the Advances in Ophthalmology And Visual Systems journal show that the lenses, which should be warn overnight, reshape the curve in the eye while the wearer sleeps. Vision correcting lenses are already available for adults as it has been proved that sight is improved the day after wearing lenses.

అద్భుతం: ఆ లెన్స్ ధరిస్తే కంటి సమస్యలు మాయం

Posted: 11/30/2015 06:50 PM IST
Special contact lenses that change the curve in the eye

టెక్నాలజీ రోజు రోజుకు మారుతోంది. మనిషికి కష్టంగా అనిపించిన ప్రతి పనిని టెక్నాలజీ సులభంగా మార్చింది. అయితే హెల్త్ కేర్ లో టెక్నాలజీ తీసుకువచ్చిన రెవల్యూషన్ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కంటి సంబంద సమస్యలతో బాధపడుతుంటారు. ఎంతో మందికి కంటి సమస్యల కారణంగా కళ్లద్దాలు ధరిస్తుంటారు. అయితే కొంత మంది ఎన్నో సంవత్సాలు ధరించాల్సి ఉంటుంది. ఇక కొంత మంది ఎన్ని సంవత్సరాలు ధరించినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ కొత్తగా వచ్చిన లెన్స్ వాడితే అలాంటి వాళ్లకు రాత్రికి రాత్రే కంటి సమస్యలు తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును.. కొత్తగా వచ్చిన లెన్స్ వాడకం వల్ల దాదాపు అందరికి కంటి సమస్యలు తొలిగిపోతున్నట్లు అకడమిక్ జనరల్ ది అడ్వాన్సెస్ ఇన్ అప్తమాలజీ అండ్ విజువల్ సిస్టమ్స లొ దీని మీద ప్రత్యేక వ్యాసం వెలువడింది.

కొత్తగా వచ్చిన లెన్స్ లను వాడటం వల్ల దీర్ఘ దృష్టి, రస్వ దృష్టి ఉన్న వారికి మంచి ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. బ్రిటన్ కు చెందిన శాస్ర్తవేత్తలు తయారు చేసిన కొత్త లెన్స్ వాడకం వల్ల అన్ని రకాల దృష్టి సమస్యలు దూరమైనట్లు వారు గుర్తించారు. దాదాపుగా పది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న పరీక్షల ఫలితంగా తాము ఈ విజయాన్ని సాధించినట్లుగా వారు వెల్లడిస్తున్నారు. ఆర్థ్రోకీరోటాలజీ లేదా ఆర్ర్థో కె అనే ఫిల్టర్  కెపాసిటీ ఉన్న లెన్స్ వాడకం వల్ల కార్నియా షేప్ లో మార్పులు తీసుకువస్తుంది. తనంతట తానుగా జరిగే ఈ మార్పు మయోపియాలో మార్పులకు దారి తీస్తుంది. ఫలితంగా కంటి సమస్యలు వేగంగా సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత పది సంవత్సరాలుగా యుఎస్ లోని  ఎనిమిది నుండి పద్నాలుగు సంవత్సరాల 282 చిన్నారులకు ఈ పరీక్షలు నిర్వహించి అందులో మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. దీన్ని ఆప్తమాలజీలోనే అతి పెద్ద విజయంగా ఆ వ్యాసం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles