No one can ask Aamir to leave India, says West Bengal CM Mamata benerjee

Mamata banerjee comes out in support of aamir khan

Bollywood actor aamirkhan, woman, commits, suicide, after, husband, criticizes, BJP leader satrghnasinha Aamir, mamatha benerjee aamir, Shahnawaz Hussain aamir, Wife suicide, aamir khan intolerance, West Bengal CM Mamata Banerjee

West Bengal CM Mamata Banerjee extended support to Bollywood actor Aamir Khan who is at the centre of a controversy over his remarks on intolerance

అమీర్ అసహన వ్యాఖ్యలపై చల్లారని దుమారం

Posted: 11/27/2015 01:10 PM IST
Mamata banerjee comes out in support of aamir khan

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చేసిన అసహన వ్యాఖ్యలపై దుమారం ఇంకా కొనసాగుతోంది. ఆయనపై కేంద్ర మంత్రుల నుంచి సాధారణ బీజేపీ, శివసేన, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వరకు, అటు దేశభక్తులని చెప్పుకుంటున్న పలువరు కూడా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరువాత.. ఆయనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దుగా నిలిచారు.  

ఆమిర్ తాను ఏం భావించాడో అదే చెప్పాడని, ప్రజాస్వామ్య దేశంలో తనకు నచ్చినది చెప్పే హక్కు అతనికి ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. అతన్ని దేశం వదిలి వెళ్లమని చెప్పాే అధికారం ఏ ఒక్క రాజకీయ పార్టీకీ, ఏ ఒక్కరికీ లేదని అమె స్పష్టం చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిపరంథామన్ ఆమిర్‌కు మద్దతుగా నిలిచారు. తన వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన విమర్శలపై ఆమిర్ స్పందించిన తీరును బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసించారు.

కాగా, బీజేపి పార్లమెంటు సభ్యుడు, బీజేపి నేత శతృఘ్నసిన్హా.. ఆమిర్ తనకు సన్నిహితుడని, అయితే దేశంలో అసహనం పెరుగుతోందంటూ అతను చేసిన వ్యాఖ్యలను మాత్రం తాను సమర్థించలేనని ట్విటర్‌లో పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందిస్తూ.. ఆమిర్‌ఖాన్ తన పూర్వీకులు నివసించిన అఖ్తియార్‌పూర్‌లో పర్యటించి, అక్కడి ప్రజల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా ఉందో తెలుసుకోవాలన్నా రు.
 
ఆమిర్‌పై రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమిర్‌ఖాన్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నా.. ఎప్పుడూ ఆయన దేశాన్ని విడిచి వెళ్లాలని భావించలేదన్నారు. తాను ఎదుర్కొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్‌నాథ్ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamirkhan  mamatha benerjee  Intolerance  satrghnasinha  

Other Articles