Metro rail to stick to original alignment

Begumbazar bandh over no changes in merto alignment

L&T Metro Rail Hyderabad, Hyderabad Metro Rail project, ‘original alignment’, Re alignment, Legislative Assembly, Sultan Bazar, Hyderabad metro gets nod to proceed, bandh, heritage monuments, metro ceo md gadgil

L&T Metro Rail Hyderabad (L&TMRH), the concessionaire building the Hyderabad Metro Rail project, is going ahead with the ‘original alignment’ with regard to the viaduct passing opposite the Legislative Assembly and another through the Sultan Bazar.

పాత అలైన్ మెంట్ ప్రకారంమే మెట్రో పరుగులు.. సుల్తాన్ బజార్ బంద్

Posted: 11/27/2015 10:44 AM IST
Begumbazar bandh over no changes in merto alignment

హైదరాబాద్‌లో మెట్రోకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయడం లేదని, పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే మెట్రో పనులు నిర్వహిస్తున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో సీఈవో, ఎండీ వీబీ గాడ్గిల్‌ తేల్చి చెప్పడంతో సుల్లాన్ బజార్ వ్యాపారస్థులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వారు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. దుకాణాలను మూసివేసి.. మెట్రో రైల్వే అలైన్ మెంట్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తమ పక్షాన మాట్లాడిన ప్రభుత్వం ఒక్కసారి మౌనంగా వుండటంలో అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

నగరంలోని చారిత్రాత్మక కట్టడాలు, పలు వాణిజ్య కేంద్రాల నుంచి మెట్రలో వెళ్లినచ్చేది లేదని భీష్మించిన ప్రభుత్వ మాటమార్చి పాల అలైన్ మెంట్ ప్రకారమే పనులు పూర్తి చేయాలని అదేశించడంమేంటని వారు నిలదీస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన మెట్రో సీఎండి గాడ్డిల్. అసెంబ్లీ ముందు, సుల్తాన బజార్‌లో మెట్రో పనులు యథాతథంగా జరుగుతున్నాయని స్పష్టం చేయడంతో సుల్తాన్ బజార్ లో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.

అయితే పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్‌పై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలో ఇతర మెట్రో స్టేషన్లలో ఎక్కడా కనిపించని విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణికులను ఆకర్షించేలా నాగోల్‌ మెట్రో స్టేషనలో ఏర్పాటు చేసిన రిటైల్‌ షాప్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్లలో విభిన్నమైన రిటైల్‌ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి నగరంలో మెట్రో రైల్‌ సేవలు ప్రారంభించే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు.

ప్రస్తుతం మియాపూర్‌-ఎస్ ఆర్‌నగర్‌ రూట్లో మెట్రో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ‘‘ప్రభుత్వ ఆదేశాల మేరకే పాతనగరంలో ఫలక్‌నామా మెట్రో డిపోతో పాటు మెట్రో మార్గం పనులు చేపడుతున్నాం. మూసీ నది మధ్య నుంచి మెట్రో పనులు చేపట్టడం సాంకేతికంగా పలు సవాళ్లతో కూడుకుని ఉందన్నారు నాగోలు- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన మార్గంలో బోయిగూడ, ఆలుగడ్డబావి, ఎలిఫెంటా బ్రిడ్జి ప్రాంతాల్లో రైలు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌వోబీ)లను వచ్చే ఏడాది నవంబర్‌నాటికి పూర్తి చేస్తే ఈ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నాయి గాడ్గిల్‌ తెలిపారు. నగరంలోని 64 మెట్రో స్టేషన్లలో క్విస్‌ రెస్టారెంట్లు, లార్జ్‌ ఫార్మాట్‌ పుడ్‌ కోర్ట్స్‌, ఏటీఎం, మెడికల్‌ స్టోర్లు, లాండ్రీ సెంటర్లు ఇలా అన్నీ అందుబాటులో ఉంటాయన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro rail  alignment  assembly  sultan bazar  heritage monuments  

Other Articles