Turkey downs Russian warplane

Turkey downs russian warplane

Russia, Turkey, Warplane, Syria, ISIS, Putin, Russia AirForce

Turkey shot down a Russian warplane , prompting an angry response from Moscow and heightening tensions in the global struggle over the future of Syria and the fate of the Islamic State. The Turkish military said two F-16s shot down the Russian Su-24 attack aircraft after it breached Turkey's airspace — and after Turkey issued 10 warnings in five minutes. Russia's defense ministry denied the plane ever strayed from Syria airspace.

ITEMVIDEOS: రష్యా విమానాన్ని కూల్చిన టర్కీ

Posted: 11/25/2015 09:32 AM IST
Turkey downs russian warplane

హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తమ గగనతలాన్ని అతిక్రమించిన రష్యా యుద్ధవిమానాన్ని కూల్చివేశామని టర్కీ తెలిపింది. ఇది వెన్నుపోటు అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. టర్కీతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.  సిరియా సరిహద్దును దాటి తమ విమానం టర్కీ గగనతలంలోకి వెళ్లలేదని రష్యా పేర్కొంది. విమానం కూల్చివేతకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సు-24 యుద్ధ విమానాన్ని టర్కీ సైన్యం భూమిపైనుంచే ఫిరంగులతో దాడి చేశారని, దీంతో సిరియా భూభాగంలోనే కూలిపోయిందని తెలిపింది.

ఈ ఆరోపణలను టర్కీ ఖండించింది. తాము అనేకమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో తమ ఎఫ్-16 యుద్ధ విమానాలు రష్యా విమానంపై దాడి చేశాయని వివరించింది. తమ విమానం కూలిపోవడానికి ముందు ఇద్దరు పైలట్లు పారిచ్యూట్‌ల సాయంతో కిందకు దూకారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. రష్యా యుద్ధ విమానం తుర్క్‌మన్ పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని బ్రిటన్‌కు చెందిన సిరియా మానవ హక్కుల సంస్థ నాయకుడు రామీ అబ్దుర్ రహమాన్ చెప్పారు. మరోవైపు నాటో అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Turkey  Warplane  Syria  ISIS  Putin  Russia AirForce  

Other Articles