TRS Party cader in celebrations

Trs party cader in celebrations

warangal, Celebrations, TRS Celebrations, TRS Bhavan, KCR, Warangal, Pasunuri Dayakar, Warangal, Polls, Warangal Elections, Warangal Bypolls, warangal Results, TRS, TRS Candidate Pasunuri Dayakar

TRS Party leaders celebrating the occasion,, while Warangal bypoll counting. Pasunuri Dayakar leads two lakh votes in this stage.

కారోళ్లు హుషారు.. మిగిలిన వాళ్లు బేజారు

Posted: 11/24/2015 12:52 PM IST
Trs party cader in celebrations

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడినట్లే. కారు చూపించిన జోరు ముందు హస్తం, కమలం వాడిపోయాయి. ఇక ఫ్యాన్ గుర్తు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం దరిదాపుల్లోకి కూడా ఏ అభ్యర్థిని రానివ్వనంతలా టిఆర్ఎస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది. అయితే కారు జోరు గురించి ముందే ఊహించినా కానీ ఇంతలా ప్రభంజనం సృష్టిస్తుంది అని ఎవరూ ఊహించలేదు. ఇక టిఆర్ఎస్ కు తగిన శాస్ర్తి చేస్తారని అంతకంతకు గొప్పలు, డాంభికాలకు పోయిన ప్రతిపక్షాలు మిన్నకున్నాయి. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు అన్ని పార్టీలు ప్రకటించాయి. తొలి రౌండ్ నుండి కారు జోరుతో గులాబీ దళంలో ఉత్సాహం పెరిగిపోయింది.

Also Read: వరంగల్ కింగ్.. దయాకర్

పోస్ట్ బ్యాలెట్ ఫలితాల నుండి టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. కాగా అధికార దుర్వినియోగం, అవినీతి వల్ల వరంగల్ ఎన్నికల్లో గెలుపు సాధ్యపడిందని కొందరు విమర్శిస్తున్నారు. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ప్రజా తీర్పును గౌరవిస్తామని అన్నారు. కాగా అధికారంలో ఎవరు ఉంటే ఉప ఎన్నికల్లో వారిదే గెలుపు అన్నది అందరికి తెలుసునని అన్నారు. ఇక వరంగల్ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగరవేస్తున్న పసనూరి దయాకర్ వరంగల్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ది కార్యక్రమాల వల్లే గెలుపు సాధ్యమైందని దయాకర్ వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles