mohan reddy bank accounts freeze

Cid to seek custody of mohan reddy and binamis

Money lender-ASI Mohan Reddy, ASI turns money lender, ASI Mohan Reddy spreads finance business far and wide, Telangana, ASP janardhan reddy, DGP office, Hyderabad, transferred, crime, law and justice, exploiting, fleece people, Karimnagar district, CID officers, acb officials, Department of Registration

The CID police teams freezed mohan reddy accounts, and is planning to take his benamis into police custody for interrogation to get more details.

వడ్డాసురుడు మోహన్ రెడ్డి కేసులో దూకుడు పెంచిన సిఐఢి

Posted: 11/24/2015 12:10 PM IST
Cid to seek custody of mohan reddy and binamis

పోలీసు ముసుగులో వడ్డీ వ్యాపారిగా మారి తన వడ్డీ సామ్రాజ్యాన్ని కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్ వరకు విస్తరించిన ఏఎస్సై మోహన్‌రెడ్డి దందాలపై విచారిస్తున్న సీఐడీ, ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మోహన్‌రెడ్డితో పాటు బినామీలుగా వ్యవహరించిన 19 మందికి సంబంధిం చి వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను స్తం భింపజేయాలని బ్యాంక్ మేనేజర్లకు సీఐడీ అధికారులు లేఖలు రాశారు. ఒక్క కరీంనగర్‌లోనే వివిధ బ్యాంకుల్లో మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి సుమారు 40 బ్యాంక్ అకౌంట్లను గుర్తించినట్లు తెలిసింది.

అలాగే, జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల నుంచి మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యు లు, బినామీల పేరిట ఉన్న ఖాతాల వివరాలను ఇవ్వాలని సీఐడీ అధికారులు ఆయా బ్యాంకుల ఉన్నత అధికారులకు లేఖలు పంపారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన సీఐడీ అధికారులు జిల్లా కోర్టు అనుమతితో మోహన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, బినామీ పూర్మ శ్రీధర్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ విచారణలో తెరవెనుక ఉన్న పోలీస్ అధికారులు జాతకాలు బయటపడే అవకాశాలున్నాయి.

గత నెల 29న కరీంనగర్‌లోని కెన్ క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామగిరి ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్త చావుకు మోహన్‌రెడ్డి కారణమని ప్రసాదరావు సతీమణి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మోహన్‌రెడ్డికి చెందిన రెండు ఫోన్లను సీఐడీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ప్రసాదరావు ఆత్మహత్యకు ముందు మోహన్‌రెడ్డి, ప్రసాదరావుకు మధ్య జరిగిన ఫోన్, సంక్షిప్త సందేశాలతోపాటు అంతకుముందు మోహన్‌రెడ్డి ఎవరెవరితో మాట్లాడారనే అంశాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక కీలకం కానుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CID officers  acb officials  Department of Registration  

Other Articles