Warangal voter decision will reveal within few hours

Warangal voter decision will reveal within few hours

Warangal, Elections, Polls, Results, Voters, warangal Polls, TRS, Congress, BJP, YSRCP, KCR

Counting of votes for the just held by-election to the Warangal (SC) Lok Sabha seat would be taken up today. The exercise would be undertaken in seven halls in the Enumamula market yard here,” District Collector V Karuna said. The counting would begin at 8 am.Section 144 of CrPC (preventing unlwaful assembly) has been imposed at the venue to as a precautionary measure. he by-poll held on November 21 had witnessed a voter turn-out of 68.59 per cent.

ఓరుగల్లు ఓటరు తీర్పు.. మరికొన్ని గంటల్లో

Posted: 11/24/2015 07:35 AM IST
Warangal voter decision will reveal within few hours

వరంగల్ కోటలో జెండా ఎగురేసే వీరుడెవరో మరికొద్ది గంటల్లో తేలనుంది. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ఓట్లలెక్కింపు కొద్ది గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. గతం కంటే పోలింగ్ శాతం తగ్గడంతో దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారన్నది అంశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తామే విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓరుగల్లు ఓటరు తీర్పు మరికొన్ని గంటల్లో వెల్లడి కానుంది..ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల కౌంటింగ్... ఉత్కంఠకు గురి చేస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటర్ తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన అన్ని పార్టీల్లో ఉన్నా...ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ పైనే అందరి దృష్టీ ఉంది.

వరంగల్ లోక్ సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గంలోని 14 పోలింగ్ కేంద్రాలను ఒక్కో రౌండ్ గా విభజించి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని టేబుల్స్ దగ్గర ఉండే ఏజెంట్లకు పాస్ లు మంజూరు చేశారు. 8గంటలకు లెక్కింపు ప్రారంభమైన వెంటనే మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఫస్ట్ రౌండ్ రిజల్ట్..9గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికార టీఆర్ ఎస్ తో పాటు..కాంగ్రెస్,బీజేపీ,వైసీపీ,వామపక్షాల అభ్యర్థులు ప్రధానంగా బరిలో ఉన్నారు. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల కౌంటింగ్ పై ఎంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో...ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ...మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కన్నా ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. గతం కంటే పోలింగ్‌ శాతం 7.92 శాతం తగ్గడంపై చర్చ సాగుతుంది. పోలింగ్‌ శాతం తగ్గడంతో తమ మెజార్టీ తగ్గుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Elections  Polls  Results  Voters  warangal Polls  TRS  Congress  BJP  YSRCP  KCR  

Other Articles