Delhi autorickshaw driver leaves software engineer, family to die after mishap, flees with belongings | delhi crime news

Autorickshaw driver leaves engineer family to die after accident flees with belongings

auto accident, software engineer died in auto accident, auto driver leaves techie family to die, delhi auto driver ran away with bags after accident, delhi crime news, audo drivers crime news

autorickshaw driver leaves engineer family to die after accident flees with belongings : An auto-rickshaw driver in Delhi fled with luggage leaving his passengers dying on road after the speeding vehicle overturned. A software engineer died and his family members suffered injuries in the accident while the auto driver ran away with their belongings.

డ్రైవర్ యాక్సిడెంట్ చేసి.. కుటుంబాన్ని దోచుకున్నాడు!

Posted: 11/23/2015 04:19 PM IST
Autorickshaw driver leaves engineer family to die after accident flees with belongings

గమ్యస్థానానికి చేరుస్తానని ఓ సాఫ్ట్ వేర్ కుటుంబాన్ని తన ఆటోలో కూర్చోబెట్టుకున్న ఓ డ్రైవర్.. విచక్షణారహితంగా వాహనాన్ని నడిపి ఘోర ప్రమాదానికి దారితీశాడు. ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చాల్సిందిపోయి.. వారి దగ్గరున్న సొమ్ము దోచుకుని అడ్రెస్ లేకుండా పరారయ్యాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా.. అతని భార్య, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబోధ్ శ్రీవాస్తవ్ (42) తన భార్య సుష్మ, కొడుకు ప్రియన్ తో కలిసి ఛత్ పూజ కోసం బీహార్ లోని సొంత ఊరికి వెళ్ళాడు. ఆ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి తన కుటుంబంతో ఢిల్లీకి పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడినుంచి ఇంటికి రావడానికి వారు ఆటో మాట్లాడుకున్నారు. అయితే.. వాహనాన్ని అతివేగంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ ను శ్రీవాస్తవ్ రెండు సార్లు వారించాడు. అయినా వినకుండా మరింత వేగం పెంచాడా డ్రైవర్. దీంతో అదుపు తప్పిన ఆటో.. డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో శ్రీవాస్తవ్ ఆటో కిందపడి చనిపోయాడు. అతని కొడుకు, భార్య కాస్త దూరంగా పడి తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ దారుణానికి కారకుడైన ఆటోడ్రైవర్ ఆ బాధితులను ఆదుకోవాల్సిందిపోయి.. వారికి సంబంధించిన మూడు బ్యాగులను, ల్యాప్ ట్యాప్ ను తీసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. శ్రీవాస్తవ్ భార్య సుష్మ మెల్లగా కోలుకుని సాయం కోసం అర్థించగా.. కొందరు వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన గురించి సుష్మ మాట్లాడుతూ.. వేగంగా నడపొద్దని తన భర్త వారించినా వినకుండా డ్రైవర్ దుర్భాషలాడుతూ మరింత వేగం పెంచాడని ఆరోపించింది. దీంతో ఆటో తిరగబడి పోయిందని, ఈ ఘటనలో తన భర్త ఆటో కింద చనిపోగా.. కొడుకు దూరంగా పడిపోవడం తనకు గుర్తుందని తెలిపింది. ఆటోను పక్కకు తీసిన డ్రైవర్ సామాగ్రి ఆటోలో పెడుతోంటే, తమకు సాయం చేస్తున్నాడనుకున్నాననీ, కానీ తమ బ్యాగులు తీసుకుని  అక్కడినుంచి పరారవుతాడని అస్సలు ఊహించలేదని ఆమె తెలిపింది. ఆ తరువాత మెల్లిగా తేరుకుని, ఆ దారిన వెళుతున్న వాహనదారులను సాయమడిగి ఆసుపత్రికి చేరామంటూ ఆ దుర్ఘటను గుర్తు చేసుకుంది. తన భర్త మరణానికి కారణమైన ఆ ఆటోడ్రైవర్ ని గుర్తు పడతానని తెలిపారు. ప్రస్తుతం ఆ ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles