దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఒకదాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు మాజీ సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లను అదుపులోకి తీసుకోగా.. మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాను కూడా సీబీఐ నాలుగో ముద్దాయిగా చేర్చింది. దీంతో.. అతని కుమారుడు రాహుల్ ముఖర్జియా స్పందిస్తూ.. తన తండ్రికి, షీనా హత్యకేసుకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. అయితే.. రాహుల్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సీబీఐ వెల్లడించిన కొన్ని విషయాలు పీటర్ కు, షీనా హత్యకు సంబంధాలున్నాయని పరోక్షంగా చెబుతున్నాయి.
షీనా చనిపోయిందన్న విషయం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని సీబీఐ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. అందుకే ఆయన పోలీసు అధికారి దేవెన్ భారతీని కావాలనే కలిశారని, కనిపించకుండా పోయినా షీనా ఫోన్ కాల్ డేటా తమకు ఇవ్వాలని, ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయనను కోరినట్లు సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ హత్యను ఒక మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం ఇంద్రాణి, పీటర్ కలిసి చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీబీఐ వర్గాలు విశ్వసిస్తున్న ప్రకారం... షీనా చనిపోయిన విషయం పీటర్ కు ముందే తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన రాహుల్ ముఖర్జియాను కూడా తప్పుదోవ పట్టించాడని తెలుస్తోంది. కాగా.. ఇంద్రాణి, పీటర్ సంప్రదించిన పోలీసులు అధికారి భారతీని ఈ కేసులో ఆధారంగా చేర్చారు.
ఇదిలావుండగా.. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియా ముగ్గురూ కలిసి కేవలం ఆస్తి కోసమే షీనాను ఓ పథక ప్రకారం హత్య చేసినట్టు సీబీఐ తన విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే! షీనాను అంతం చేస్తే ఆస్తి అంతా తన రెండో కూతురు నిధికే దక్కుతుందని భావించిన సంజీవ్.. ఆమెను చంపేందుకు పథకం రచించాడు. అలాగే.. రాహుల్ ముఖర్జీతో షీనా పెళ్లి జరిగితే ఆస్తి అంతా అతను ఎగరేసుకుపోతాడనే భయంతో పీటర్ ముఖర్జీయా కూడా ఈ కుట్రలో భాగం పంచుకున్నాడు. ఇక మొదటినుంచి తల్లీకూతుళ్ల మధ్య వివిధ వ్యవహారాల మధ్య తగాదాలు వున్నాయి. సీబీఐ వెల్లడించిన ఈ వివరాల మేరకు.. పీటర్ కు ఈ హత్య గురంచి ముందే తెలుసన్న అనుమానాలు బలపడుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more