marriage registration to be made compulsory in karnataka

Karnataka new bill applies brakes on big fat wedding

karnataka government, Marriage registration, compulsory, Big Fat Wedding, karnataka, wedding, marriage, bill, state assembly, CM siddaramaiah, shackles of marriage organisers, lavish spendets, bride groom, brides, hefty fine on violating provisions

The Karnataka government has introduced a bill in the state assembly that is sure to apply brakes on the concept of big fat wedding.

పెళ్లికి సిధ్దమవుతున్నారా..? అయితే ఈ నిబంధనలు తెలుసా...?

Posted: 11/21/2015 12:05 PM IST
Karnataka new bill applies brakes on big fat wedding

జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లి జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలని, తమ భావి తరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని ఎంతో మంది కాబోయే వధువరులు కలలు కంటుంటారు. అట్టహాసాలు, అడంబరాలకు ఏమాత్రం కొదవలేకుండా తమ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి పెళ్లి చేయాలనుకుంటారు వధూవరుల తల్లిదండ్రులు. అప్పటి వరకు మన్స్పర్థలతో దూరమైనవారిని కూడా తమ సంతానం పెళ్తికి ఆహ్వానిస్తుంటారు పెద్దలు. ఇక పెళ్లి హడావిడిలో తమ దూరపు బంధువులను మర్చిపోతే.. ఇంకేముంది.. ఏదో ఒక అలాంటి వేడుకలోనే వారి పరుపుపోయేలా చులకన చేసి మాట్టాడటం.. లేదా అసలు చూసిచూడనట్లు వ్యవహరించడం బంధువులకు అలవాటే. అయితే కర్ణాటకలో మాత్రం ఇక బంధువులకు ఈ ఆలకలు అలవాటు కావాల్సిందే.

ఎందుకంటారా.. లక్షలు... కోట్ల రూపాయలు... ఖర్చు చేసి ధూంధాం... అంటూ బంధువులందరినీ పెళ్లికి పిలవడం ఇక కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆడంబరాల పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేయడానికి వీలుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లును శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. ముసాయిదా బిల్లులో ముఖ్య నిబంధనల ప్రకారం.. కల్యాణ మండపం అద్దె రూ. 50 వేలకు మించకూడదుట, అంతేకాదు అతిథిలు 300కు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదట వీటితో పాటు పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుమును వసూలు చేస్తామని కూడా హెచ్చరిస్తుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలో విమర్శలు చెలరేగుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka government  Marriage registration  Big Fat Wedding  

Other Articles