v hanumantha rao takes on subramanian swamy

He is a blackmailer sadist congress sr leader slams bjp leader

V Hanumantha rao, T Cong MP, Subramanian Swamy, bjp leader, congress MP, congress rajyasabha MP, Rahul Gandhi, british citizen, bihar elections, bihar defeat outcome, BJP, PM modi, amit shah

v hanumantha rao takes on subramanian swamy, says he is a blackmailer and sadist

ఔరా..! నిజమేనా..!! ఆయన ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్టా..!

Posted: 11/20/2015 03:43 PM IST
He is a blackmailer sadist congress sr leader slams bjp leader

ఔరా.. నిజమేనా..! అన్నట్లుగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ హన్మంతరావు విరుచుకుపడ్డారు. రంద్రాన్వేషణ చేసి లేని విషయాలను ఇతరులపై అపాధించి వారిని ఇరుకున్న పెట్టే సుబ్రహ్మణ్యస్వామి బ్లాక్ మెయిలర్, శాడిస్టు అని వీహెచ్ అభివర్ణించారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సుబ్రమణ్యస్వామిపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుబ్రహ్మణ్యస్వామి సాగితస్తున్న ఆటలన్నింటినీ దేశ ప్రజలు గమనిస్తున్నారని, వీటిపై డిల్లీ, బిహార్ ప్రజల తరహాలోనే దేశ ప్రజలు కూడా స్పందించే రోజు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

అధికారం మదాందకారంతో మాట్లాడుతున్న సుబ్రహ్మణ్య స్వామి సహా బీజేపి నేతలు త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బీహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని బీజేపీ నేతలు.. దాని నుంచి బయటపడేందుకు రాహుల్ గాంధీపై లేనిపోని అభూతకల్పనలు చేస్తూ ఓటమి అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. పార్టీ సీనియర్లతో పాటు పలువురు ఎంపీలు, .ప్రతిపక్షాలు ఓటమిపై నిలదీస్తుండంతో.. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే సుబ్రహ్మణ్యస్వామి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోదీ, ఆరెస్సెస్ మెప్పు కోసమే సుబ్రహ్మణ్యస్వామి అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు. విచారణ జరుపుకోవాలన్న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ చేసిన సవాల్ను స్వీకరించాలని మోదీని వీహెచ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : V Hanumantha rao  T Cong MP  Subramanian Swamy  bjp leader  

Other Articles