????? ???????? ?????????? ??????? ‘???? ????’

Facebook blocked woman engineer account claiming isis terrorist

facebook blocked techie acount claiming isis terrorist, techie isis terrorist, Isis Anchalee, Isis Anchalee facebook blocked, Isis Anchalee news, Isis Anchalee twitter, facebook blocked engineer account, టెక్కీ అకౌంట్ బ్లాక్ చేసిన ఫేస్ బుక్, ఐసీస్ యాంచలీ, ఐసీస్ ఉగ్రవాద సంస్థ

తన పేరులో ఐసీస్ అనే పదాన్ని కలిగి వుండటంతో ఫేస్ బుక్ ఆమె ఖాతాను ఉగ్రవాద ఖాతాగా పరిగణిస్తూ బ్లాక్ చేసింది. అప్పుడు ఆమె ట్విటర్ లో అసహనం వ్యక్తం చేయగా.. ఫేస్ బుక్ ప్రతినిధి సమాధానమిచ్చి మళ్ళీ ఆమె అకౌంట్ ని యాక్టివేట్ చేశారు. నకిలీ అకౌంట్లను తొలగించే చర్యలో ఈ పొరపాటు జరిగిందని, అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

మహిళా టెక్కీని ఉగ్రవాదిగా మార్చిన ‘ఫేస్ బుక్’

Posted: 11/19/2015 12:57 PM IST
Facebook blocked woman engineer account claiming isis terrorist

సామాజిక మాధ్యమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ‘ఫేస్ బుక్’ ఓ మహిళను ఉగ్రవాదిగా మార్చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసుకుంటూ తన జీవిన విధానాన్ని కొనసాగిస్తున్న ఆ టెక్కీ ఖాతాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఖాతాగా భావిస్తూ ‘ఫేస్ బుక్’ బ్లాక్ చేసేసింది. ఈ విధంగా ఫేస్ బుక్ సంస్థ నుంచి ఊహించని పరిణామం ఎదురుకావడంతో ఆ టెక్కీ ఒక్కసారిగా ఖంగుతింది. అనంతరం కోలుకొని ఆమె తన అసహనం వ్యక్తం చేసింది. ఇంతకీ ఫేస్ బుక్ ఆ విధంగా ఎందుకు చేసిందంటే.. ఆమె తన పేరులో ‘ఐసీస్’ అనే పదాన్ని కలిగి వుండటమే.

‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌ అండ్ సిరియా’ ఉగ్రవాద గ్రూపు సంక్షిప్త నామం ఐఎస్ఐఎస్. దీనిని కలిపి చదివితే ఐసీస్ అవుతుంది. ఇదే పేరును శాన్‌ఫ్రాన్సికోకు చెందిన ఐసీస్ యాంచలీ అనే మహిళా స్టాఫ్‌వేర్ డెవలపర్‌ కలిగి ఉండటంతో.. ఆమె ఖాతాను ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఖాతాగా భావిస్తూ ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ టెక్కీ.. ‘ఫేస్ బుక్’పై మండిపడంది. తన ఫేస్‌బుక్ లాగిన్ పేజీలో 'అకౌంట్‌ డిజెబుల్డ్' అని వచ్చిన సందేశాన్ని ప్రింట్‌స్ర్కీన్ తీసిన ఆమె.. ట్విట్టర్‌లోని ఫేస్‌బుక్ పేజీలో పెట్టి.. ‘మీరు నా పర్సనల్ అకౌంట్‌ను ఎందుకు తొలగించారు. నా అసలు పేరు ఐసీస్‌ యాంచలీ’ అని పేర్కొంది. అలాగే.. ఫేస్ బుక్ సంస్థపై ఆమె మండిపడుతూ.. ‘ఫేస్‌బుక్ నన్ను ఉగ్రవాదిగా చూస్తోంది. మళ్లీ అకౌంట్‌ను తెరిపించడానికి వాళ్లకు నా పాస్‌పోర్టు స్క్రీన్‌షాట్ తీసి పంపించడం సరికాదనుకుంటా’ అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది.

ఈ విధంగా ఆ మహిళా టెక్కీ తన ట్విట్టర్‌లో పెట్టిన వ్యాఖ్యకు ఫేస్‌బుక్ సిబ్బంది ఒకరు సమాధానమిచ్చి.. ఆమె అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్‌ చేశారు. పొరపాటును ఆమె అకౌంట్‌ బ్లాక్‌ చేసినందుకు ‘ఫేస్‌బుక్’ క్షమాపణలు చెప్పింది. నకిలీ అకౌంట్లను తొలగించే చర్యలో భాగంగా పొరపాటును ఈ ఘటన జరిగిందని, పొరపాటు తెలిసిన వెంటనే ఆమె ఖాతాను పునరుద్ధరించామని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Isis Anchalee  facebook blocked engineer account  isis terrorists  

Other Articles