Italian has second lucky escape at Bataclan after 30 years Heysel | massimiliano escape from paris attacks

Italian man massimiliano second lucky escape from paris attack on saturday

italian man second lucky escape, massimiliano survives from paris attack, man escape from paris attack because of kiss, a kiss survive man from paris attack

Italian man massimiliano second lucky escape from paris attack on saturday : An Italian tourist had a second lucky escape on Saturday when he emerged from the bloodiest scene of the Paris attacks with only a slight injury, 30 years after surviving the deadly Heysel stadium disaster in Brussels.

ఆ ముద్దే.. అతణ్ణి ఫ్రాన్స్ ఉగ్రదాడి నుంచి కాపాడిందట!

Posted: 11/16/2015 03:26 PM IST
Italian man massimiliano second lucky escape from paris attack on saturday

ఫ్రాన్స్ లోని బటక్లాన్ థియేటర్‌లో శనివారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఎంతోమంది ప్రాణాలు విడవగా.. ఒక్క వ్యక్తి మాత్రం కేవలం చిన్నచిన్న గాయాలతో తప్పించుకున్నాడు. అతడి పేరే మస్సిమిలియానో నటలుక్సి. కాలిఫోర్నియా రాక్‌బాండ్‌ ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్‌ మ్యూజిక్‌ను ఆస్వాదించడానికి ఆరోజు ఎంతోమంది విచ్చేశారు. కానీ.. హఠాత్తుగా జరిగిన ఉగ్రదాడిలో దాదాపు అందరూ చనిపోయారు. కానీ.. ఇటాలియన్ టూరిస్ట్ అయిన మస్పిమిలియానో చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. అయితే.. అతడి స్నేహితుడి భుజంలోకి తూటా దిగడంతో శస్త్ర చికిత్స అవసరం అయింది. వీరిద్దరికీ సుమారు మూడు మీటర్ల దూరంలోనే ఉగ్రవాదులు వున్నప్పటికీ  మస్సిమిలియానో తండ్రి చెప్పారు. ఆ ఉగ్రదాడి నుంచి మస్సిమిలియానో సురక్షితంగా బయటపడడానికి కారణం ‘ముద్దు’ అని అతని సోదరి ఫెడెరికా వివరించింది.

తన సోదరునికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు పోప్ జాన్ పాల్ -2ను రోమ్‌లో కలిశాడని, అప్పుడు అతగాడు తన సోదరునికి ముద్దు పెట్టారని... అందుకే తన సోదరుడు అదృష్టవంతుడయ్యాడని ఫెడెరికా చెప్పింది. మస్సిమిలియానో ఎంత అదృష్టవంతుడంటే.. ఇలాంటి ప్రమాదం నుంచి అతగాడు ప్రాణాలతో బయటపడటం ఇది రెండోసారి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం బ్రస్సెల్స్‌లోని హేజెల్ స్టేడియంలో యూరోపియన్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను మస్సిమిలియానో తన తండ్రి, అంకుల్‌తో కలిసి చూస్తున్నాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్లు. ఎంతోమంది అభిమానులు కేరింతలు హోరెత్తిన ఆ స్టేడియంలో అనుకోకుండా ప్రమాదం చోటు చేసుకుంది. మస్సిమిలియానో కూర్చుని వున్న పక్క గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో 39 మంది ప్రాణాలొదిలారు. అంతటి ప్రమాదం నుంచి కూడా మస్సిమిలియానో మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. ఇలా రెండు పెను ప్రమాదాల నుంచి అతను బయటపడటానికి ‘పోప్ జాన్ పాల్ -2’ అతనికి ముద్దు పెట్టడమే కారణమని ఫెడెరికా ఆనందం వ్యక్తం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles