Nitish is Bihar's tallest leader : Shatrughan Sinha

Bihar polls shatrughan sinha targets pm narendra modi

Shatrughan Sinha, Narendra Modi, Bihar election, Shatrughan Sinha targets PM Narendra Modi, Nitish is Bihar's tallest leader, grand alliance, Nitish Kumar, Narendra Modi,Lalu Yadav, Bihar

BJP MP Shatrughan Sinha said the “credit” for the seats won by the party in Bihar went to Prime Minister Narendra Modi and claimed that the PM's attack on RJD chief Lalu Prasad backfired.

మోడీ పుణ్యమా అనే 53 సీట్లు వచ్చాయన్న బీజేపీ ఎంపీ

Posted: 11/15/2015 01:52 PM IST
Bihar polls shatrughan sinha targets pm narendra modi

సినీ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోమారు ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53 సీట్లు గెలుచుకోవడం ఆయన పుణ్యమేనంటూ వ్యంగ్యంగా అన్నారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ బిహార్‌కు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ఎన్నికల జిమ్మిక్కులో భాగమేనని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో లాలూ ప్రసాద్ యాదవ్‌ను జంగిల్ రాజ్‌గా అభివర్ణించడాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారని అన్నారు. అది కూడా బీజేపీ ఓటమికి ఓ కారణమని అన్నారు.

ఎన్నికల ప్రచారం నుంచి తనను ఉద్దేశ పూర్వకంగా తప్పించడాన్ని పట్నా ప్రజలు జీర్ణించుకోలేకపోయారని, దీనిని వారు సీరియస్‌గా తీసుకుని బీజేపీని ఓడించారని శత్రుఘ్నసిన్హా అన్నారు. ఈ బిహారీ బీజేపి నేతను పట్నా ప్రజలు లక్షల ఓట్ల మెజారిటీతో పార్లమెంట్‌కు పంపించారు. అటువంటి వ్యక్తిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పిస్తే వారు సహించగలరా’’ అని అన్నారు. నితిశ్ వ్యతిరేక ప్రచారం కూడా బీజేపీ ఓటమికి ఓ కారణమని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Sinha  Narendra Modi  Bihar election  grand alliance  

Other Articles