educated con family in mumbai cheated a housewife of lakhs by playing high drama | family cheated woman in mumbai

Educated con family in mumbai cheated a housewife of lakhs

con family cheated housewife, educated family cheated woman in mumbai, mumbai con family cheated housewife

educated con family in mumbai cheated a housewife of lakhs : educated con family in mumbai cheated a housewife of lakhs by playing high drama.

విద్యావంతులైన ఆ ఫ్యామిలీ.. ఓ మహిళను ముంచేసింది!

Posted: 11/13/2015 09:10 PM IST
Educated con family in mumbai cheated a housewife of lakhs

ఎంతటి ఉన్నత స్థానంలో వున్నా సరే.. ‘డబ్బు’ పెడదారి పెట్టిస్తుందని ఓ కుటుంబం నిదర్శనంగా నిలిచింది. ఆ కుటుంబంలో వున్నవారందరూ విద్యావంతులైనప్పటికీ.. భారీ మోసాలకు పాల్పడుతూ వ్యక్తుల్ని నిట్టనలువునా ముంచేయడమే వారి పని. ముంబైలో నివాసముంటున్న జేమాల కుంబరే అనే మహిళ గృహిణి కాగా ఆమె భర్త సతీష్ ఓ జాతీయ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఆ దంపతుల కొడుకు తపన్ మర్చంట్ నేవీ ఉద్యోగి కాగా కుమార్తె దుర్గ ఓ డెంటిస్ట్. ఈ స్థాయిలో ఉన్న కుటుంబాన్ని చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది. కానీ.. డబ్బుల వ్యామోహంలో పడిపోయిన ఆ ఫ్యామిలీవారంతా మోసగాళ్లుగా మారి ఓ మహిళను ముంచేశారు. తమ అద్భుత నటనతో ఓ మహిళకు టోకరా వేసిన వీరు.. ఖరీదన మోసాన్ని రక్తి కట్టించారు. చివరికి బండారు బయటపడటంతో.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

ముంబై నగరానికే చెందిన క్లెరా సాజి జార్జ్(34) అనే మహిళ చార్కోప్ ప్రాంతంలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఈ ప్రస్తావనను తన స్నేహితురాలు అనితా రాజా వద్ద తీసుకొచ్చింది. తన స్నేహితురాలి ఆవేదనను అర్థం చేసుకున్న అనితా.. ఎలాగైనా ఆమెకు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్లెరాను జేమాలకు పరిచయం చేసింది. చేప వెతుక్కుంటూ తమ గాలంలో వచ్చి పడిందని భావించిన జేమాల... ఫ్లాట్ కొనడంలో తప్పక సహాయ పడతానని చెప్పుకొచ్చింది. ఈ విషయం తన కుటుంబసభ్యులకు తెలియజేసి.. ఆమె దగ్గర భారీ నగదు కాజేయాలని ప్లాన్ వేశారు. పథకం ప్రకారం.. జేమాల కుటుంబం మొత్తం వివిధ పాత్రల్లో చక్కగా అమరిపోయారు. ఇక అప్పుడు అసలు ‘మోసం’ కథ మొదలైంది.

ఒకరోజు క్లెరాను కలిసిన జేమాల.. తన భర్త మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంహెచ్ఏడీఏ)లో పనిచేస్తున్నాడని, ప్లాట్ పని క్షణాల్లో అయిపోతుందని తన మాయమాటలతో నమ్మించింది. ఆ వెంటనే చార్కోప్ ప్రాంతంలోని ఎంహెచ్ఏడీఏ టవర్ బిల్డింగ్‌ ‘55ఇ’లో 17వ అంతస్తులోని 1701 ప్లాట్‌ను చూపించి, రూ.27 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఆ ఫ్లాట్ క్లెరాకు నచ్చడంతో కొనేందుకు ఓకే చెప్పింది. అయితే అంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనని, వాయిదాల రూపంలో ఇస్తానని చెప్పింది. దీనికి జేమాల అంగీకరించింది. ఇందులో భాగంగా 2013 నుంచి 2014 మధ్య రూ.15 లక్షలను నగదు, చెక్కు రూపంలో అందించింది. డబ్బు అందుకున్న జేమాల తన భర్తతో ఫ్లాట్‌కు సంబంధించిన నకిలీ అలాట్‌మెంట్ లెటర్ ఇప్పించింది.

క్లెరా వారికి సగం డబ్బులు ఇచ్చేసింది కాబట్టి.. తాను కొనుగోలు చేసిన ఫ్లాట్ కు వెళ్లి నివాసం ఏర్పరుచుకుందామని అనుకుంది. 2014లో తన ఫ్లాట్‌కు వెళ్లిన క్లెరాకు మైండ్ బ్లాక్ అయింది. అందులో వేరే కుటుంబం నివాసముండడంతో సొమ్మసిల్లిపోయింది. తాను మోసపోయానని ఓ క్లారిటీకి వచ్చిన క్లెరా.. జేమాలను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ.. అప్పటికే వారి కుటుంబం పరారైనట్టు తెలిసి కన్నీరు మున్నీరైంది. ఏం చేయాలో పాలుపోని క్లెరా వెంటనే చార్కోప్ పోలీసులకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కండివిలి ప్రాంతంలో జేమాలను అరెస్ట్ చేశారు.

ఇక ఆమె భర్త, కొడుకు, కుమార్తె పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో జేమాల భర్త సతీష్ ఎంహెచ్ఏడీఏ అధికారి పాత్ర పోషించగా కుమారుడు తపన్ డబ్బు లావాదేవీలు నిర్వహించాడని, కుమార్తె దుర్గ మీడియేటర్‌గా వ్యవహరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : con family cheated housewife  educated family cheated woman in mumbai  

Other Articles