Arizona Telugu association diwali celebrations

Arizona telugu association diwali celebrations

Arizona Telugu association, AZTA, AZTA diwali celebrations, AZTA deepavali celebrations, Arizona Telugu association diwali celebrations, Arizona Telugu association deepavali celebrations

Like every year, even this year, Arizona Telugu association is conducting Diwali celebrations, which forms the part of many cultural and social events.

అరిజోనా తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలు

Posted: 11/12/2015 12:12 PM IST
Arizona telugu association diwali celebrations

తెలుగు వారి ప్రభను దేశదేశాన ఎంతో మంది ఎగరవేస్తున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన.. పొగడరా నీ తల్లి భూమి భారతిని..నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు సుబ్బారావు అన్నట్లు మన తెలుగు వారు కూడా ఎక్కడ ఉన్నా కానీ తెలుగు వెలుగులు విరజింపజేస్తున్నారు. అరిజోనాలో ఉన్న తెలుగు వారు కూడా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలను పెంచడమే కాకుండా.. తెలుగు వారిని ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారు.

దీపావళి సంబరాలు ఎక్కడున్నా కానీ వైభవంగా చేసుకుంటాం అది మన సంప్రదాయం. అరిజోనాలో ఉన్న తెలుగు వారి కోసం అక్కడి అరిజోనా తెలుగు అసోసియేసన్ దీపావళి వేడుకలను తెలుగు వారితో కలిసి చేసుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. అరిజోనా తెలుగు అసోసియేషన్ ఈ శనివారం తెలుగు వారితో కలిసి, సంప్రదాయబద్దంగా దీపావళి వేడులను నిర్వహించేందుకు మేరీల్యాండ్ లో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.

స్థానికంగా ఉంటున్న వారి ప్రతిభను పట్టం కట్టేలా అరిజోనా తెలుగు అసోసియేషన్ సాంస్రృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే అరిజోనా స్టేట్ యూనివర్సిటి విద్యార్థుల చేత మ్యూజిక్ అండ్ డ్యాన్స్ షో కూడా నిర్వహించడం జరుగుతుంది. అసలే దీపావళి వేడుకలు మరి టపాసులు లేకపోతే ఎలా అందుకే ప్రత్యేక ఆకర్షణగా ఫైర్ వర్క్స్ ఉండబోతున్నాయి. చిన్నారుల కోసం డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. ఇండియన్ జువెలరీ తో పాటు ఇండియన్ డ్రెస్సుల కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చెయ్యనున్నారు. తెలుగు వారి సంప్రదాయమైన, రుచికరమైన భోజనం కూడా ఉంటుంది.

అరిజోనా తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలు..
వేదిక: ఐఎసిఆర్ఎఫ్ హాల్ (IACRF Hall), డబ్లు మేరీల్యాండ్ ఎవ్, ఫియోనిక్స్, అరిజోనా- 85017
తేది:  14 నవంబర్ శనివారం
సమయం:  మధ్యాహ్నం 3.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు
నామమాత్రపు అడ్మిషన్ ఫీజ్ ఉంది
మరిన్ని వివరాలు మరియు టికెట్ల కోసం.. http://www.azindia.com/ లేదా http://www.azteluguassociation.com ను చూడండి.


అరిజోనా తెలుగు అసోసియేషన్ గురించి:
1989లో అరిజోనా తెలుగు అసోసియేషన్ ను స్థాపించారు. ఇందులొ దాదాపు 800 మంది సభ్యులుగా ఉన్నారు. తెలుగు వారి సంస్రృతిని కాపాడి.. అందరిని ఒక్కతాటి మీదకు తీసుకురావడినికి అరిజోనా తెలుగు అసోసియేషన్ కృషి చేస్తోంది. అలాగే ఈ అసోసియేషన్ ఉగాది, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలను చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఈ పండుగ సందర్భంగా తెలుగు వారి ప్రతిభకు పట్టం కట్టడమే కాకుండా అందరికి ఏకం చేస్తుంది. ప్రతి సంవత్సరం టోర్నమెంట్ లు నిర్వహించడం, వివిధ ఎంటర్ టెన్ మెంట్ కార్యక్రమాలను నిర్వహించడం కూడా చేస్తుంది. డ్యాన్స్, మ్యుజిక్ లో మంచి మంచి పర్ఫామెన్స్ లకు కూడా అరిజోనా తెలుగు అసోసియేషన్ వేదికగా నిలుస్తుంది. తెలుగు భాష, సంస్రృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ తెలుగు వారి ఔనత్యాన్ని పెంచడానికి అరిజెనా తెలుగు అసోసియేషన్ విశేష కృషి చేస్తోంది. భారత సంస్రృతి, సంప్రదాయాలను కాపాడేందుకు స్థానికంగా ఉండే వివిధ యూనియన్లు, ఆర్గనైజేషన్ లతో అరిజోనా తెలుగు అసోసియేషన్ పని చేస్తోంది. అలాగే ప్రతి ఆరు నెలలు, నెలకు ఒకసారి సమాచారాన్ని అందిస్తూ న్యూస్ లెటర్ ను కూడా అరిజోనా తెలుగు అసోసియేషన్ ప్రచురిస్తోంది.

Telugu-association-diwali1
Telugu-association-diwali2
Telugu-association-diwali3
Telugu-association-diwali4
Telugu-association-diwali5
Telugu-association-diwali6

అరిజోనా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మినేని వెంకట్ గురించి..
యూనివర్సిటి ఆఫ్ ఫోనిక్స్ లో చదువుకున్నారు. గుంటూరు కు చెందిన వెంకట్ కొమ్మినేని ముందు నుండి నడిపించే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఇతను ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీలో పి.హెచ్.డి చేశారు. యునివర్సిటి ఆఫ్ ఫోనిక్స్ నుండి ఎంబిఎ చేశారు.టి-సిస్టమ్స్ లో సర్వీస్ లైన్స్ హెడ్ గా పని చేస్తున్నారు. తెలుగు వారి ఉన్నతిని కోరుకునే వ్యక్తుల్లో వెంకట్ కొమ్మినేని పేరు ముందు కనిపిస్తుంది. అమెరికాలోని తెలుగు వారిని ఏకం చేసేందుకు తెలుగు సంస్రృతిని కాపాడేందుకు వెంకట్ కొమ్మినేని నాయకత్వంలో అరిజోనా తెలుగు అసోసియేషన్ విశేషంగా కృషి చేస్తోంది.

Venkat-kommineni1
Venkat-kommineni10
Venkat-kommineni11
Venkat-kommineni12
Venkat-kommineni13
Venkat-kommineni14
Venkat-kommineni2
Venkat-kommineni3
Venkat-kommineni4
Venkat-kommineni5
Venkat-kommineni6
Venkat-kommineni7
Venkat-kommineni8
Venkat-kommineni9

ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి.. అలా నడిపించిన వారి బాటలో మిగిలిన వాళ్లు నడుస్తారు... ఆ నడిపించే నాయకుడే వెంకట్ కొమ్మినేని. అరిజోనా తెలుగు అసోసియేషన్ తెలుగు వారిని ఏకం చేస్తోంది అంటే అది కేవలం వెంకట్ కొమ్మినేని వారి శ్రమ వల్ల మాత్రమే. నిరంతరం ఏదో చెయ్యాలే తపన.. మన వాళ్లు ఎక్కడున్నా బాగుండాలనే తాపత్రయం.. ఎక్కడున్నా మూలాలు మరవకూడదు అన్న దీక్ష వెంకట్ కొమ్మినేని గారిని నాయకుడిగా, విజయవంతమైన బిజినెస్ మ్యాన్ గా మార్చింది. అరిజోనాలో తెలుగు వారు గర్వపడేలా వెంకట్ కొమ్మినేని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అరిజోనా తెలుగు అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జి. జనార్దన్ లాంటి  ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. జి. జనార్దన్ రెడ్డి పసంద్ అనే ఇండియన్ రెస్టారెంట్ ను నడిపారు.  డిగ్నిటి హెల్త్ అనే ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నారు. అమెరికాలోని 17 రాష్ట్రాల్లో హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న డిగ్నిటి హెల్త్ విశేషంగా కృషి చేస్తోంది. 

అరిజోనాలో ఉన్న తెలుగు వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని అరిజోనా తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ కొమ్మినేని పిలపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Arizona Telugu association  AZTA  Diwali  

Other Articles