a woman filed case on her husband when she knew that man is already married with another woman and have two children also | husband cheat wife

Woman cheated by her husband who already got married with another woman and have children also

husband cheat wife, wife cheated by husband, husband crime news, wife cheated husband, husband wife crime news, wife harassed by husband, husband harassed wife

woman cheated by her husband who already got married with another woman and have children also : a woman filed case on her husband when she knew that man is already married with another woman and have two children also.

రాకుమారుడనుకుంది.. నిండా మోసపోయింది!

Posted: 11/10/2015 04:33 PM IST
Woman cheated by her husband who already got married with another woman and have children also

తోడులేక ఒంటరిగానే 43 ఏళ్లు జీవితాన్ని గడిపిన ఓ మహిళ తన భాగస్వామి కోసం వెతుకుతుండగా.. రాకుమారుడిలా ఓ వ్యక్తి కనిపించాడు. అతని అందానికి ముగ్ధురాలైపోయిన సదరు మహిళల అతని ప్రేమలో మునిగిపోయింది. కొన్నాళ్లు అతనితో ప్రేమాయణం నడిపిన అనంతరం పెళ్ళి కూడా చేసుకుంది. వీరి దాంతప్య జీవితం కొన్నాళ్లపాటు బాగానే కొనసాగింది. అయితే.. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం బయటపడింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిలో నిండా మోసపోయానంటూ భోరమంది. వెంటనే ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. కానీ.. ఇంతలోనే తేరుకుని తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండంటూ పోలీసుల గుమ్మం ఎక్కింది.

న్యూయార్క్ కు చెందిన 43 ఏళ్ల రేచల్‌ లీ అప్పటివరకు ఒంటరి జీవితాన్నే గడుపుతూ వచ్చింది. తన కలల రాకుమారుడు ఏదో ఒకరోజు దొరుకుతాడని భావించింది. ఇంతలోనే ఆమెకు సోగ్గాడిలా, ఆకర్షణీయమైన డ్రెస్‌తో 40 ఏళ్ల అమెరికా ఆర్మీ సార్జంట్‌ స్కాట్‌ ఫుల్లర్‌ ఎదురయ్యాడు. అతనిని చూసిన వెంటనే తన కలల రాకుమారుడు దొరికాడని సంతోషించిన ఆమె.. ఎలాగైనా అతనిలో పెళ్లి చేసుకోవాలని పరిచయం చేసుకుంది. అది కాస్త ప్రేమగా మారింది. 2013 ఆగస్టులో వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. నాలుగు నెలలకే పెళ్లి పీటలెక్కారు. శోభనం గదిలోకి దక్షిణ కొరియా సంప్రదాయ వస్త్రాలతో వచ్చిన స్కాట్‌ను చూసిన రేచల్‌ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. తాను కోరినట్లుగానే అందాల రాకుమారుడు తనకు భాగస్వామిగా లభించాడని ఎంతో మురిసిపోయింది. అతను అడిగినట్లుగానే తన దగ్గరున్న ధనాన్ని ఏమాత్రం ఆలోచించకుండా, అనుమానించకుండా ఇస్తూ వచ్చింది. తనకు నచ్చిన వరుడు దొరికాడు కాబట్టి.. ఇకనుంచి తన జీవితంలో ఎటువంటి కష్టాలు వుండవని భావించింది. కానీ.. ఆ సమయం రానే వచ్చింది.

కొంత కాలం తర్వాత స్కాట్‌ తన మొబైల్‌ను అమ్మాలనుకున్నాడు. అంతకుముందు దాన్ని రీఫార్మేట్‌ చేయడానికి సాయం చేయమని తన భార్య రేచల్‌ను పిలిచాడు. అప్పుడు అతని మొబైల్ తీసుకున్న రేచల్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అందులో స్కాట్‌ తొలి తన భార్య మరియానేకి పంపించిన ఈ-మెయిళ్లు కనిపించడంతో కళ్ల ముందు ప్రపంచం తలకిందులైంది. అతనికి ఇదివరకే పెళ్లైన రహస్యాన్ని తెలుసుకుంది. గుట్టు బయటపడేసరికి స్కాట్‌ ఎంచక్కా తిరిగి మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోయాడు. అతనికి ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నారు. అప్పటికే ఆమె క్రెడిట్‌ కార్డుపై 50 వేల డాలర్లు అప్పు చేసి, స్కాట్‌కు సమర్పించుకున్న రేచల్.. అతని చేతిలో నిండా మోసపోయానంటూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే.. అనంతరం తేరుకుని, నష్టపరిహారం కోసం కేసు పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband cheat wife  harass cases  

Other Articles