vivek oberoi praises ktr by calling ram anna on twitter | apache helicopter manufacture company in hyderabad

Ktr vivek oberoi twitter wishes over apache helicopter company in hyderabad

vivek oberoi, ktr, apache helicopter manufacturing company, hyderabad it hub, telangana state

ktr vivek oberoi twitter wishes over apache helicopter company in hyderabad : vivek oberoi praises ktr by calling ram anna on twitter.

కేటీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ హీరో

Posted: 11/10/2015 02:06 PM IST
Ktr vivek oberoi twitter wishes over apache helicopter company in hyderabad

తెలంగాణ ఐటీశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మెచ్చకున్నాడు. హైదారాబాద్ నగరంలో ఐటీ రంగాన్ని వృద్ధి చేయడంలో కేటీఆర్ చేస్తున్న పనితనానికి ఆ హీరో కొనియాడాడు. స్వయానా హైదరాబాదీవాసీ అయిన వివేక్.. ఇప్పుడు ఈ నగరంలో వేగంగా డెవలప్ అవుతున్న వైనాన్ని చూసి, అందుకు గల కారణమైన కేటీఆర్ ను అన్నా అని సంబోధిస్తూ పొగిడాడు.

హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని కేటీఆర్ ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించాడు. సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు,  'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు. దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్‌లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vivek oberoi  ktr  apache helicopter manufacturing company  

Other Articles