two rowdy brothers killed a person who went to ask question why they give murder warning to his brother | crime news

Two rowdy brothers killed a person without any reason

crime news, west godavari crime news, murder cases, murder crimes, rowdy brothers killed a person

two rowdy brothers killed a person without any reason : two rowdy brothers killed a person who went to ask question why they give murder warning to his brother.

ఒక్క ‘ప్రశ్న’.. ఓ కుటుంబాన్నే నాశనం చేసేసింది!

Posted: 11/09/2015 06:34 PM IST
Two rowdy brothers killed a person without any reason

తన తమ్ముడ్ని చంపేస్తానంటూ భయపెట్టిన రౌడీని ‘ఏం జరిగింది’ అని ప్రశ్నించడానికి వెళ్లిన అన్నయ్య శవమై కనిపించాడు. రక్తపుమడుగుల్లో పడివున్న భర్తను చూసి గర్భంతో వున్న అతని భార్య కన్నీటి పర్యంతమయ్యింది. ఇక కొడుకు శవాన్ని చూసి కుమిలిపోయిన తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబసభ్యులు, స్థానికులు అందరూ నిందితుల కుటుంబంపై దాడి చేసి ఇల్లు తగులబెట్టారు. నిందితుల కుటుంబంలోని ఇద్దరు మహిళలను స్థంభానికి కట్టేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో చోటు చేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శనివారపు పేటకు చెందిన లంకపల్లి చింతారావు, లంకపల్లి శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ జులాయిగా తిరుగుతూ స్థానికంగా రౌడీయిజం చెలాయిస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం చింతారావు మద్యం తాగి బైకుపై వస్తూ స్థానిక కమ్యూనిటీ హాలు వద్ద కూర్చున్న పలిపే మార్యూ, తేరా రవితో గొడవకు దిగాడు. దుర్భాషలాడుతూ చంపుతానంటూ కత్తి చూపి వారిని బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడిన మార్యూ, రవి అక్కడి నుంచి పారిపోయారు. వీరిద్దరిలో రవి అనే యువకుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పగా... అతని అన్నయ్య సంజీవరావు కోపాద్రిక్తుడై చింతారావు ఇంటికి వెళ్లాడు. ‘మా తమ్ముణ్ణి చంపుతానన్నావట అసలేం జరిగింది’ అని అతను అడుగుతూండగానే.. చింతారావు, అతని సోదరుడు శేఖర్ పక్కనే ఉన్న సమ్మెటతో సంజీవరావు తలపై బలంగా మోదాడు. ఆ దెబ్బతో సంజీవరావు తల పగిలి కనుగుడ్లు బయటకు వచ్చాయి. సంజీవరావు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. హత్యకు పాల్పడిన అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.

ఇది గమనించిన మృతుడి బంధువు తేరా లక్ష్మయ్య కేకలు పెడుతూ గ్రామంలోకి పరుగులు పెట్టాడు. వ్యవసాయ కూలీ అయిన సంజీవరావుకు ఆరునెలల కిందట స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. భర్త రక్తపు మడుగులో ప్రాణాలు వదలడం చూసిన స్వాతి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలిసిన సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును చూసిన నాగేశ్వరరావు కుమిలిపోయిన నాగేశ్వరరావు.. కొడుకు మృతదేహం వద్దే కుప్పకూలిపోయాడు. అతనిని బంధువులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. సంజీవరావు హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో వున్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rowdy brothers killed a person  family murder cases  

Other Articles