an intermediate student tirupatamma attempted suicide because of six other college students harassing her | harassing cases

Intermediate student tirupatamma suicide six members harassed

tirupatamma suicide case, harassing case, girl harassing, student harassed by six members, boy harassing student, harassing cases in andhra pradesh, guntur district crime news, crime records, ap crime stories, girl harassing case

intermediate student tirupatamma suicide six members harassed : an intermediate student tirupatamma attempted suicide because of six other college students harassing her regularly when she went to her college.

‘ఆ ఆరుగురి వేధింపులు భరించలేక.. ఆత్మహత్య’

Posted: 11/09/2015 11:05 AM IST
Intermediate student tirupatamma suicide six members harassed

ఆరుగురు ఆకతాయిలు నిత్యం పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీకి వెళుతున్న సమయంలో తనను ఆ ఆరుగురు యువకులు నిత్యం వేధించడంతోపాటు బెదిరించేవారని, వాటిని తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ అమ్మాయి లేఖ రాసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది.

మాచర్లలోని కృష్ణవేణి కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న తిరుపతమ్మ (17) రోజూ వెల్దుర్తి నుంచి ఆర్టీసీ బస్సులో కాలేజీకి వెళుతుంది. ఈ క్రమంలో అదే బస్సులో ప్రయాణించే ఆరుగురు యువకులు వేధించారని లేఖలో పేర్కొంది. వారందరూ చక్రధర్ డిగ్రీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సర విద్యార్థి ప్రేమ్‌రాజ్‌నాయక్, పల్నాడు జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్న గిబ్రియాల్‌నాయక్, వెల్దుర్తికి చెందిన ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న పవన్, శిరిగిరిపాడుకు చెందిన ఆదినారాయణ, వెంకటేశ్, పల్నాడు జూనియర్ కళాశాలకు చెందిన సీఈసీ విద్యార్థి సురేష్‌గా వివరించింది. వీరిలో ప్రేమ్‌రాజ్‌నాయక్ గురించి వివరిస్తూ.. అతగాడు మత్తుమందు ఇచ్చి ఆడపిల్లలను లైంగికంగా వేధించి బెదిరిస్తుంటాడని, అలాంటి కీచకుడి మర్మాంగాన్ని ముక్కలు ముక్కలు చేయాలని లేఖలో రాసింది. అంతేకాదు.. ఆత్మహత్యకు ముందు మూడుపేజీల్లో వారు పెట్టిన వేధింపులు, తాను అనుభవించిన కష్టాలను కష్టాలను ఆమె వివరించినట్లు తెలుస్తోంది.

రోజురోజుకు వారి వేధింపులు మరింత పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిరుపతమ్మ.. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఆదివారం కళాశాలకు సెలవు కావటం, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తాడు, చున్నీలతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు సత్యవతి, కొండలు ఫ్యాన్‌కు వేళ్లాడుతున్న తిరుపతమ్మను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని.. ‘నిర్భయ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. తిరుపతమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirupatamma suicide case  girl harassing case  student harassed case  

Other Articles