SInger Kanikakapur compose a song on Modi UK Visit

Singer kanikakapur compose a song on modi uk visit

Singer kanikakapur, Modi, UK Tour, Modi in UK, Modi UK Visit song

Hello namasthete song composed by singer Kanikakapur on Modi"s UK Visit. The Song describe the ralation between the India and UK.

ITEMVIDEOS: మోదీకి హలో నమస్తే అంటున్న బ్రిటన్

Posted: 11/09/2015 08:25 AM IST
Singer kanikakapur compose a song on modi uk visit

త్వరలో బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్రమోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ జోష్ను ఓ పాటను స్వరపరిచారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహసంబంధాలను తెలిపే విధంగా హలో నమస్తే అంటూ హిందీ, ఇంగ్లీష్ పదాలున్న పాటను రూపొందించినట్లు సంగీత దర్శకుడు కీర్తి మాథుర్ పేర్కొన్నారు. స్నేహానికి చిహ్నంగా నిలిచిన షోలేలోని యే దోస్తి అనే చరణంతో పాట ప్రారంభమై.. బాంగ్రా బీట్‌తో ఊపందుకుంటుందని తెలిపారు.

కాగా, బ్రిటన్ పర్యటనలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలుపడానికి సిద్ధమవుతున్న పలు సంఘాలను అడ్డుకోవడానికి స్కాట్లాండ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నవంబర్ 13న వెంబ్లే స్టేడియం వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బ్రిటన్‌లోని దళిత హక్కుల సంఘం క్యాస్ట్‌వాచ్‌యూకే, ఆవాజ్ హ్యూమన్ రైట్స్ నెట్‌వర్క్, సౌత్ ఏషియా సాలిడారిటీ అనే సంస్థలు ప్రకటించాయి. నార్త్ లండన్‌లో అంబేద్కర్ స్మారక మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనిని అడ్డుకునేందుకు నాట్ ఇన్ అవర్‌నేమ్ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆవాజ్ నెట్‌వర్క్ ప్రకటించింది. నిర్భయ ఘటనపై తీసిన ఇండియాస్ డాటర్‌పై నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఆ డాక్యుమెంటరీ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ నిరసనకు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singer kanikakapur  Modi  UK Tour  Modi in UK  Modi UK Visit song  

Other Articles