arvind-kejriwal slams narendra modi and amit shah over proudness

Bihar result a referendum arvind kejriwal

Arvind Kejriwal, Nitish Kumar, JDU, BJP, Bihar polls, polls in Bihar, Bihar elections 2015, narendra modi, amit shah, proudness

Delhi Chief Minister Arvind Kejriwal today termed the Bihar poll verdict a referendum against the Narendra Modi government as the Bharatiya Janata Party (BJP)-led NDA stared at defeat at the hands of the grand alliance in the state.

ప్రధాని మోడీ, అమిత్ షాలపై కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు

Posted: 11/08/2015 03:13 PM IST
Bihar result a referendum arvind kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో అధికారాన్ని చేజింక్కించుకుని ముందుకు సాగుతున్న క్రమంలో నిత్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష జోక్యంలో ఇబ్బందులను ఎదుర్కోంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతునే వున్నారు. ఈ క్రమంలో వెల్లడైన బీహార్ ఫలితాల నేపథ్యంలో ఆయన మరోమారు మోడీ సర్కార్ పై కేజ్రీవాల్ ఘాటుగా వ్యాఖ్యాలు చేశారు. బీహార్ ఎన్నికలు బీజేపి కళ్లు తెరిపించాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి రావడంతో వాళ్లకు ఆరేడేళ్ల తర్వాత గర్వం వచ్చిందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఏడాదిలోపే గర్వం వచ్చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. బిహార్ ఫలితాలతో ప్రజలు ఆ గర్వాన్ని బద్దలు కొట్టారన్నారు. ఈ ఫలితాల పుణ్యమాని కేంద్రంలో వాళ్ల మంత్రులకు పనిచేసే స్వతంత్రం వస్తుందని, బీజేపీలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు గౌరవం లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ పాలనలో వేలు పెడుతున్న తీరు ఇకపై ఆగుతుందని భావిస్తున్నామని చెప్పారు.

వాళ్లు పదే పదే.. ప్రతిరోజూ తమ పనిలో వేలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రం జోక్యం తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు. అసహన వాతావరణం ఇప్పటికైనా ఆగుతుందని, జాతుల మధ్య,  ప్రజల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. బిహార్ ఫలితాలు ఒక రకంగా ప్రధాని నరేంద్రమోదీ పనితీరు మీద రిఫరెండం లాంటివని అన్నారు. ఆయనెలా పనిచేస్తున్నారో, అమిత్ షా - మోదీ జోడీ ఎలా ఉందో యావత్ దేశానికి తెలిసిపోయిందని విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections 2015  arvind kejriwal  narendra modi  amit shah  proudness  

Other Articles