lalu prasad rjd wins major seats in bihar elections

Bihar voter stands by lalu prasad yadav rashtiya janata dal party

bihar election results, lalu prasad, rjd, rjd major party in bihar, grand alliance, bihar elections, bihar election 2015, live bihar election, live election results, 2015 election results, bihar election results 2015, bihar live election results, bihar election news, election news

Exactly five years ago, Lalu Prasad Yadav s Rashtriya Janata Dal (RJD) won 22 seats in the 243-seat, but now its the biggest winning party

బీహార్ లో ప్రభంజనం చాటుకున్న లాలూ ఆర్జేడీ

Posted: 11/08/2015 02:03 PM IST
Bihar voter stands by lalu prasad yadav rashtiya janata dal party

దాణా కుంభకోణం.. ఆయన రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాదు ఆయన పార్టీ మనుగడ కూడా కష్టంగా మార్చింది. ఆయన రాజకీయాల నుంచి పక్కకు జరగడమే మంచిదని రాజకీయ విశ్లేషుకులు గత ఎన్నికల నేపథ్యంలో విమర్శలు కూడా చేశారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో..  మొత్తం 243 నియోజకవర్గాలున్న బిహార్ అసెంబ్లీలో లాలు ప్రసాద్ సొంత పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ గెలుచుకున్న సీట్లు కేవలం 22. అప్పట్లో బీజేపీ 91 స్థానాలు, దాని మిత్రపక్షం జేడీయూ 115 స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు పార్టీలు విడిపోయాయి.

సరిగ్గా ఐదేళ్ల తర్వాత తాజాగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రం జేడీయూ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి జట్టుకట్టిన లాలు.. ఈసారి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. గత ఎన్నికలలో ఆయన ఓటరు మహాశయుడి ఆగ్రహాన్ని చవిచూస్తూ.. ఈ సారి ఆయన ఆయన పార్టీనే ఓటరు మహాశయుడు అక్కున చేర్చుకున్నాడు. కూటమికి మూడింట రెండొంతు స్పష్టమైన మెజారిటీ సాధించినా.. విడిగా కూటమి పార్టీలన్నింటిలోకీ ఆర్జేడీ ముందంజలో కనిపిస్తోంది.

స్వయంగా తను అసెంబ్లీ బరిలో దిగని లాలు.. తన కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లను పోటీలో నిలిపారు.  అన్నదమ్ములిద్దరూ కూడా తమ తమ స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్లలో వాళ్లు తమ ప్రత్యర్థుల కంటే కాస్త వెనుకంజలో ఉన్నా.. తర్వాత పుంజుకున్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, తన తమ్ముడు నితీష్ కుమారే సీఎం అవుతారని చెబుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల మీద కూడా ఆయన గతంలో ఎన్నడూ లేనంత ధీమా వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar elections 2015  lalu prasad  rjd  grand alliance  

Other Articles