చైనాలో ఓ ప్రియుడు తన ప్రేయసికి 4550 డైపర్లలను హృదయాకారంలో అమర్చి తన ప్రేమను తెలుపి.. ప్రేయసి మనస్సును దోచుకోగా, కాలిఫోర్నియాలో ఓ ప్రియుడు తన జ్ఞానదంతాన్ని రింగ్ గా అమర్చి తన ప్రేమను ప్రపోజ్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు. పంటితోనా! ఎలాగెలాగా అంటారా.. ఉంగరంలో ఏ రత్నమో, పగడమో, వజ్రమో ఉంగాల్సిన చోట తన జ్ఞానదంతాన్ని పొదిగాడు దాంతో రింగ్ ను తయారు చేయించాడు అంతే తన ప్రేయసి మనస్సును గెలుచుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే కాలిఫోర్నియాకు చెందిన లూకాస్ ఉంగర్ అనే ఆ యువకుడికి కార్లీ లిఫ్కెస్ అనే చిన్నదాని ప్రేమలో పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి.. ఆపై ప్రేమగా విరబూసింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. పెద్దల అంగీకారం పై వీరిద్దరూ ఎన్ గేంజ్ మెంట్ చేసుకోదలిచారు.
అదే రోజు కార్లీ కుటుంబ సభ్యులందరు చూస్తుండగా ఆమె ఎదురుగా మోకాలిపై కూర్చొని 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అంటూ జ్ఞానదంతం అమర్చిన రింగ్ తొడిగి లూకాస్ ప్రపోజ్ చేశాడు. నవ్వుతూ ఒప్పేసుకుంది క్లారీ. నా ఆప్త మిత్రుడిని వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్లీ ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. అతని జ్ఞానదంతంతో చేసి ఇచ్చిన ఉంగరం డైమండ్ రింగ్ కన్నా విలువైందని చెబుతోంది. వీరిద్దరూ నవంబర్ 21న లాస్‌వెగాస్‌లో పెళ్లి చేసుకొనున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more