underworld don chota rajan makes controversial comments on mumbai police and dawood ibrahim | chota rajan crimes

Underworld don chota rajan controversial comments on police and dawood ibrahim

chota rajan, dawood ibrahim, mumbai police, delhi police, indonesia bali jail, indonesia police officers, chota rajan controversies, chota rajan updates, chota rajan dawood

underworld don chota rajan controversial comments on police and dawood ibrahim : underworld don chota rajan says dawood ibrahim agents available in mumbai police.

‘ముంబై పోలీసుల్లో దావూద్ ఏజెంట్లు వున్నారు’

Posted: 11/03/2015 11:02 AM IST
Underworld don chota rajan controversial comments on police and dawood ibrahim

సుదీర్ఘవేట తర్వాత పోలీసులకు పట్టుబడిన అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై పోలీసుల్లో కొందరు దావూద్ ఏజెంట్లు కూడా వున్నారని, అతనితో వారు కుమ్మక్కై తనని చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాజన్ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం బాలీ జైలులో వున్న ఛోటా రాజన్ ను ఇండియాకు తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అతనితో మాట్లాడారు. అనంతనం రాజన్ ను వైద్య చికిత్సం నిమిత్తం జైలు నుంచి తరలిస్తున్న క్రమంలో అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులపై సంచలన కామెంట్లు చేశాడు. ముంబై పోలీసుల్లో కొంతమంది దావూద్ ఇబ్రహీం మనుషులు ఉన్నారని.. వారంతా అతనితో కుమ్మక్కయి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. ముంబై పోలీసులు తనకు అన్యాయం చేశారని, తప్పుడు కేసులు బనాయించారని, గతంలో తనను నానారకాలుగా వేధించారని వాపోయాడు. దీంతో తనకు ముంబై పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నాడు. ఈ కారణంగా తనను ముంబైకి బదులు ఢిల్లీకి తరలించాని పోలీసులను వేడుకున్నాడు.

ఇక దావూద్ ఇబ్రహీంకు తాను ఏమాత్రం భయపడబోనని ఛోటా రాజన్ ప్రకటించాడు. గత 22 ఏళ్ల నుంచి తాను దావూద్ తో పోరాడుతూనే వున్నానని చెప్పుకొచ్చాడు. దావూద్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. భారత ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపినా వెళ్తానని అన్నాడు. కాగా, ఇండోనేసియాలోని బాలి జైలులో ఉన్న ఛోటారాజన్ ను ఈరోజు భారత్ కు తీసుకువచ్చే అవకాశముంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chota rajan  dawood ibrahim  mumbai police  

Other Articles