tollywood comedian kondavalasa laxmana rao passes away

Kondavalasa laxmana rao no more

kondavalasa laxmana rao no more, tollywood comedian, comedian kondavalasa laxmana rao passes away, comedian and drama artist kondavalasa, kondavalasa laxmana rao, kondavalasa laxmana rao Nims, kondavalasa laxmana rao comedy bits, kondavalasa laxmana rao comedy

tollywood comedian and drama artist kondavalasa laxmana rao, who was suffering from illness passes away in NIMS today

హాస్యనటుడు కొండవలస కన్నుమూత

Posted: 11/02/2015 10:53 PM IST
Kondavalasa laxmana rao no more

ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి తుదిశ్వాస విడిచారు. 'అయితే ఓకే' అనే డైలాగ్‌తో పాపులర్‌ అయిన కొండవలసన దాదాపు 300 చిత్రాల్లో నటించి ప్రేక్షక్షుల హృదయాలను తన నటన శైలితో ఆకట్టుకున్నారు. తన కామెడీ నటనాభినయంతో అభిమానులను రంజింపజేసిన కొండవలస.. వంశీ దర్శకత్వంలో ఔను వాళిద్దరూ ఇష్టపడ్డారు అనే చిత్రంతో సినిమారంగంలోకి ఆరంగ్రేటం చేశారు.

సినిమాల్లోకి రాకముందు తనకు నటన పట్ల ఉన్న అభిరుచిని నాటకాల్లో ప్రదర్శించారు. నాటక రంగంలో తన నటనాభినయంతో రెండు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు కొండవలస. నాటకరంగంలో రాణిస్తూనే.. విశాఖ పోర్టు ట్రస్టులో ఉద్యోగిగా విధుల నిర్వహించారు. ఆగస్టు 10, 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా, కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. తన గ్రామాన్నే తన పేరుగా మార్చుకుని అటు గ్రామానికి కూడా ఆయన పేరు ప్రఖ్యాతులను సాధించిపెట్టారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరు మాసాలుగా సినిమాలకు దూరంగా వున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kondavalasa  Comedian  Tollywood  

Other Articles