police firing on chain snachers in l.b. nagar at hyderabad

Chain snatchers escaped police firing and absconded

chain snatchers, police firing, anti chain snatchers squad, vanasthalipuram, hayathnager police station, Chain snatchers rob 11 tola gold, Chain snatchers, chain snatchings, crime in telangana, crime in hyderabad

Chain snatchers give anti-snatching team the slip, escaped firing and absconded in autonagar of vanasthalipuram hyderabad

చైన్ స్నాచర్ల హల్ చల్.. పోలీసుల కాల్పులు.. నగరంలో కలకలం

Posted: 11/02/2015 01:55 PM IST
Chain snatchers escaped police firing and absconded

నానాటికీ పెరిగిపోతున్న చైన్ స్నాచర్ల ఆడగాలపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను జారీచేసినా.. రోజుకో చోట చైన్ స్నాచర్లు మాత్రం ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మరీ.. వారి మెడలోంచి బంగారు ఆభరణాలను దోచుకుని పోతున్నారు. తాజాగా హయత్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం అటోనగర్ లోని రాజధాని హోటల్ వద్ద చైన్ స్నాచర్లు మహిళల మెడలోంచి బంగారు అభరణాలను లాక్కుని వెళ్లారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

బైక్ పై దూసుకొచ్చిన దుండగులు.. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు విఫల యత్నం చేసి పారిపోతుండగా యాంటీ స్నాచింగ్ టీమ్ సిబ్బంది వారిని వెంబడించారు. వాహనం ఆపమని హెచ్చరించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రివాల్వర్ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. చివరికి దుండగులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. యాంటి స్నాచింగ్ టీమ్ పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. కాగా పారిపోయిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. తుపాకి చప్పుడుతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles