a car driver named car driver ravindra has killed his girlfriend who was beautician for doing prostitution in home | love affair controversies | marital affairs

Car driver ravindra killed his girlfriend beautician in guntur

marital affairs, marriage illegal affairs, car driver killed beautician, car driver killed gf beautician, car driver ravindra killed beautician, jayalakshmi killed by ravindra, illegal affairs controversies

car driver ravindra killed his girlfriend beautician in guntur : a car driver named car driver ravindra has killed his girlfriend who was beautician for doing prostitution in home.

వ్యభిచారం చేస్తోందని.. ‘బ్యూటీషియన్’ను చంపేశాడు

Posted: 11/02/2015 12:58 PM IST
Car driver ravindra killed his girlfriend beautician in guntur

వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకున్న మహిళలు అత్యంత దారుణంగా హతమవుతున్న సంఘటనలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చెప్పుకోబోతోంది ఆ తరహా కేసు గురంచే. అయితే.. ఇందులో కొన్ని మలుపులు వున్నాయి. 12 ఏళ్ల క్రితమే లారీ డ్రైవర్ తో వివాహం చేసుకున్న ఓ బ్యూటీషియన్.. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. డబ్బులు సంపాదించడం కోసమో లేదా మరేమైనా కోరుకుందో తెలీదు కానీ.. ఆ బ్యూటీషియన్ వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. ఆమె వ్యవహారాల గురించి తెలుసుకున్న కారు డ్రైవర్ ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బ్యూటీషియన్ తన ప్రియుడితో గొడవకు దిగింది. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఆమె ప్రియుడు.. ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన పలుపులేటి జయలక్ష్మి(31)కి 12 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీనివాసరావు లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా వున్నారు. ఈ క్రమంలో జయలక్ష్మి బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకొని ఓ పార్లర్‌లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈమెకు రవీంద్ర అనే కారు డ్రైవర్ తో పరిచయం కాగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. రవీంద్రకు కూడా ఇదివరకే వివాహం అయ్యింది కాబట్టి.. తమ అక్రమ బంధం ఎవరికీ తెలియకుండా, వ్యక్తిగతంగా గడిపేందుకు వారిద్దరూ రాజీవ్‌ గృహకల్పలో ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకున్నారట. కొన్నాళ్లపాటు తమ అక్రమ బంధం గురించి ఎవరికీ తెలియకుండా గుట్టుగానే సాగించారు. అయితే.. కొన్నిరోజుల తర్వాత ఈ విషయం రవీంద్ర భార్యకు తెలియడంతో ఆమె అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలోనే రవీంద్రకు మరో షాకింగ్ విషయం తెలిసింది. తాను ఇంట్లో లేని సమయంలో తన ప్రియురాలు జయలక్ష్మి వ్యభిచారం చేస్తున్నట్లు రవీంద్ర దృష్టికి కొందరు తీసుకొచ్చారు. ఇందులో వాస్తవం వుందా? లేదా? అనే విషయమై పరీక్షించగా.. ఆమె వ్యభిచారం చేస్తున్నట్లు నిజమేనని తేలింది. దీంతో మనస్థాపం చెందిన రవీంద్ర.. జయలక్ష్మిని వదిలేసి తన భార్యను తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న జయలక్ష్మి.. శనివారం రాత్రి రవీంద్రతో గొడవ పడింది. ఆ సమయంలో ఆవేశంతో రగిలిపోయిన రవీంద్ర.. జయలక్ష్మిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ హత్యకేసు వెనుక అసలు కారణాలేంటో ఆరా తీయగా.. మొత్తం విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బ్యూటీషియన్ మరణం వెనుక ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్న కారు డ్రైవర్ రవీంద్రేనని పోలీసులకు నిర్ధారణకు వచ్చారు. దీంతో రవీంద్రను, అతని స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles