Must show brahmanandam scene in pokiri to That minister

Show brahmanandam scene in pokiri to that minister

Animal Husbandry Minister,Kusum mehadele,madhya pradesh, Pokiri

In a shocking incident, Madhya Pradesh Animal Husbandry Minister Kusum Mehdele was seen kicking a child beggar on the busy streets of Panna district on Sunday, when he went to the minister for getting a financial help of Rs 1. The incident took place in the bus stop where the minister went on the occasion of Madhya Pradesh foundation day, was visiting bus stand for a cleanliness drive when the incident happened. Even the guards of the leader started beating the poor child mercilessly. Rights activists and opposition have condemned this brutal act and had asked for the minister’s resignation.

ఆ మంత్రికి పోకిరిలో బ్రహ్మానందం సీన్

Posted: 11/02/2015 08:41 AM IST
Show brahmanandam scene in pokiri to that minister

పోకిరి సినిమాలొ బ్రహ్మానందం ఎపిసోడ్ ను ఎవరు మాత్రం మరిచిపోతారు. బిక్షగాళ్ల బ్యాచ్ బ్రహ్మానందంను వేదించే తీరు.. అందరికి నవ్వు తెప్పించింది. ఎక్కడికి వెళ్లినా... ఏం చేస్తున్నా కానీ బాబు దానం... దానం అంటూ వేధిస్తే.. దానికి బ్రహ్మానందం పడే వేధన అంతా ఇంతా కాదు. చివరకు పోలీసులకు ఫోన్ చేసినా కానీ ఇష్టంవస్తే. దానం చెయ్యండి లేదంటే మానెయ్యండి అంటేూ చెబుతారు. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాక కాంప్రమైజ్ కు వస్తారు బ్రహ్మానందం. అయితే తాగా ఈ సీన్ ను ఓ మంత్రి గారికి చూపించాలేమో. ఎందుకంటే బిక్షం అడిగిన ఓ చిన్నారిని కాలితో తన్నడమే కాకుండా.. తన సెక్యూరిటీతో కొట్టించింది. అసలు అక్కడ ఏం జరిగిందో... తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే మానవత్వాన్ని మరిచారు. డబ్బులు అడిగాడనే కారణంతో ఓ అడుక్కునే పిల్లాడిని కాలితో తన్ని మహిళా మంత్రి తన నైజాన్ని బయటపెట్టుకున్నారు. భోపాల్‌కు సమీపంలోని పన్నాలో జరిగిన ఈ ఘటన కెమెరాకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్‌లో చెత్త ఊడ్చే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.ఈ కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా దానం చేయాలని బాలుడు అభ్యర్థించారు. దాంతో అసహనానికి గురైన మంత్రి బాలుడిని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా పసివాడిపై అంగరక్షులు చేయిచేసుకున్నారు. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. మంత్రివర్గం నుంచి కుసుమ్ మెహడేలేను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇలా వివాదంలో కూరుకుపోవడం ఆ మంత్రికి మొదటిసారి కాదు.. ఇటీవల సింహాలను, పులులను ప్రజలు పెంచుకొనే విధంగా చట్టాన్ని రూపొందించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Animal Husbandry Minister  Kusum mehadele  madhya pradesh  Pokiri  

Other Articles