trs will win in warangal bi elections says kadiam srihari

Congress party won in warangal by election says uttam kumar reddy

Telanagana ruling party TRS, Telanagana main opposition Congress party, confident of winning in by-elections, kadiam srihari, kcr, TRS, Congress, uttam kumar reddy, TPCC Chief, warangal by election

Telanagana ruling party TRS and main opposition Congress party confident of winning warangal seat in by-elections

ఉపఎన్నికలో గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

Posted: 11/01/2015 01:12 PM IST
Congress party won in warangal by election says uttam kumar reddy

వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం తమదంటే తమదేనని అధికార ప్రతిపక్ష పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకం, కాకతీయ మిషన్, విద్యుత్ కోతలు లేని తెలంగాణ ఇత్యాది పథకాలను ప్రచారం చేస్తూ అధికార పార్టీ ప్రచారం చేయాలని భావిస్తుంది. కాగా, రాష్ట్రంలో రైతన్నల మరణాలు, వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వం నిర్లక్ష్యం తదితర అంశాలను ఎక్కుపెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటను తమకే వేయాలని ప్రజలను అర్థిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతుంది.

పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు బీఫామ్ ఇస్తూ.. వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. అధికార టీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం కుదేలైందన్నారు.

దీంతో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో పాలనలో ప్రజల హక్కులను కూడా హరించి వేస్తోందని ఉత్తమ్ ఆందోళన చెందారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి కోతలు లేని కరెంట్‌ ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన అన్నారు. అధికార దాహంతోనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కడియం విమర్శించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadiam srihari  kcr  TRS  Congress  uttam kumar reddy  TPCC Chief  warangal by election  

Other Articles