professor harassment on women servant in attapur

Professor sexual harassment on domestic maid

professor rapes maid, puppalguda professor molests maid, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A domestic maid, alleges that a professor at attapur is sexually harassing her

పనిమనిషిపై అత్యాచారం.. కటకటాల ఊచలు లెక్కిస్తున ప్రోఫెసర్..

Posted: 11/01/2015 11:46 AM IST
Professor sexual harassment on domestic maid

మొన్న ఆ మధ్య ఓ అసిస్టెంట్ ప్రోఫెసర్ ఏకంగా వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడగా, తాజాగా మరో ఫ్రోఫెసర్ తన ఇంట్లో పనిచేస్తున్న యువతికి మాయమాటలు చెప్పి లైంగికంగా వేధింపులకు గురి చేసి కటకటాల ఊచలు లెక్కబెడుతున్నాడు. విద్య నేర్చినవాడు వింత పశువు అని సామెతను ఇలాంటి వారిన చూసినప్పుడు మార్చుకుని చదువుకోవాల్సి వస్తుంది. చదువుంటే సరిపోదు, సంస్కారం, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలి, సభ్యతగా నడుచుకోవాలన్న అలోచన లేకపోతే ఎంత చదువుకున్న వింత పశువులే కదా. నానాటికీ మహిళలు, యువతుల, చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లపై సభ్యసమాజానికి అవగాహన కల్పించాల్సిన స్థానంలో వుండి ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడటం.. కామ వాంఛతో ఇంట్లో మనిషిపై లైంగిక వేదింపులకు గురిచేయడం పైశాచికత్వం కాక మరేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పరిధిలో పప్పులగూడలో వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందారోఫణలు ఎదుర్కోంటున్న ప్రోఫెసర్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..పుప్పాలగూడ ప్రాంతంలో నివాసముండే ఓ ప్రొఫెసర్ తన ఇంట్లో పని చేస్తున్న యువతితో మసాజ్ సెంటర్ పెట్టిస్తానని, ఆర్థికంగా లోటు ఉండదని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో  రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : professor  harrasment  attapur  women servant  

Other Articles