One more sacrifice for special status for ap

One more acrifice for special status for ap

Durga Prasad, AP, Special Status, Central Govt. Status for ap, Chandrababu Naidu, Modi

Damand of Special status for ap, took one more live. DurgaPrasad, who attempt suicide in August month. He died in this morning.

ప్రత్యేక హోదా కోసం మరో బలిదానం

Posted: 10/30/2015 11:16 AM IST
One more acrifice for special status for ap

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ మరో బలిదానం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గా ప్రసాద్ ఆగస్టులో ఒంటికి నిప్పంటించుకున్నారు. అప్పటి నుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నేటి ఉదయం తుది శ్వాసవిడిచారు. తెలుగు రాష్ట్రాలుగా ఏపి, తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దాంతో చాలా మంది ప్రత్యేక హోదా కోసం తమ తనువులను చాలించారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కేటాయిస్తుందా..? లేదా అన్న దాని మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. దాంతో ప్రత్యేక హోదాను కోరుతూ ఉద్యమం ఉదృతమైంది.

తాజాగా హోదా కోసం అమరుడైన దుర్గాప్రసాద్ వ్యవహారంతో మరోసారి ఏపిలో ఉద్యమం మొదలయ్యే అవకాశాలున్నాయి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు ముందు రావడం లేదు. ప్రత్యేక హోదా మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే కాలం వెళ్లదీస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఏపికి ప్రత్యేక హోదా మీద ఎలాంటి వత్తిడి చెయ్యడం లేదు. చేపినట్లు అనిపిస్తున్నా... అవి పెద్దగా ఫలితాలనివ్వడం లేదు. దుర్గాప్రసాద్ మృతితొ మరోసారి ప్రత్యేక హోదా అంశం తెర మీదకు వచ్చింది. వైసీపీ నాయకులు మాత్రం ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Durga Prasad  AP  Special Status  Central Govt. Status for ap  Chandrababu Naidu  Modi  

Other Articles