get TRS MP Ticket If you know Hindi and English

Get trs mp ticket if you know hindi and english

TRS, KCR, Warangal, MP, Warangal Elections, Elections, TRS MP Candidate

TRS party searching for well known leader who know english and hindi. And also minimum knowledge of Laws candidate will get TRS MP Ticket.

హిందీ, ఇంగ్లీష్ వస్తే TRS ఎంపీ టికెట్..?!

Posted: 10/30/2015 08:27 AM IST
Get trs mp ticket if you know hindi and english

ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఏం కావాలి..? అని ఎవరిని ప్రశ్నించిన ప్రజల సపోర్ట్ ఉండాలి... కాస్త ధన బలం కూడా ఉండాలి అంటూ సమాధానాలు ఇస్తారు. కానీ తాజాగా వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ మాత్రం ఇంకో అంశాన్ని లెక్కలోకి తీసుకొని ఇస్తోంది. ఏంటా విషయం అనుకుంటున్నారా..? అభ్యర్థికి హిందీ, ఇంగ్లీష్ రావాలి.. అలాగే చట్టాల గురించి మంచి అవగాహన ఉండాలి. అదేంటి అనుకుంటున్నారా..? పార్లమెంట్ టికెట్ ఇచ్చే అభ్యర్థికి వీటి మీద అవగాహన ఉంటే ప్రజా సభలో తమ రాష్ట్రం తరఫున గట్టిగా గళాన్ని వినిపంచవచ్చు అని టిఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకే ఈ అర్హతలున్న వాళ్ళకే టికెట్ ఇస్తామని గులాబీ నేతలకు సంకేతాలు ఇచ్చారు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్. ఒక్కరికే టికెట్ ఇవ్వాలి కాబట్టి మిగతా నేతలంతా సహకరించాలని ఆశావహులందరి చేత మాట తీసుకున్నారు. చివరకు టిఆర్ఎస్ తరఫున గుడిమల్ల రవికుమార్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని పార్టీలో చర్చ సాగుతోంది.

వరంగల్ ఎన్నిక ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అన్న దాని మీద టీఆర్ఎస్ భారీగానే ఎక్సర్ సైజ్ చేసింది. ఈసారి పార్టీ వ్యక్తి, స్థానికులకే అవకాశం ఇవ్వాలని, మాదిగ, మాదిగ ఉప కులాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్లు వచ్చాయి. అధికార పార్టీ గెలిచే అవకాశాలున్న ఈ సీటుకు చాలామంది పోటీ పడ్డారు. వరంగల్ ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఆయనకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు..సీఎం కేసీఆర్.  డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్, జోగు రామన్న, చందూలాల్ తో పాటు ఎంపీ వినోద్ కుమార్, జిల్లా నేతలతో తెలంగాణా భవన్ లో సమీక్షించారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  KCR  Warangal  MP  Warangal Elections  Elections  TRS MP Candidate  

Other Articles