Indrani Mukerjea Admitted to Hospital for Suspected Dengue | sheena bora murder case | indrani latest updates

Indrani mukherjea suffering from dengue admitted in hospital

indrani mukherjea, sheena bora murder case, indrani with sheena, indrani dengue, rajesh khanna, driver shyam, indrani controversies, mumbai jj hospital, sir jj hospital

indrani mukherjea suffering from dengue admitted in hospital : Indrani Mukerjea, one of the prime accused in the Sheena Bora murder case, was admitted to Sir J.J. Hospital here on Wednesday for treatment of suspected dengue.

షీనాని చంపినందుకు ఇంద్రాణికి తగిన శాస్తి

Posted: 10/28/2015 06:02 PM IST
Indrani mukherjea suffering from dengue admitted in hospital

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాకి తగిన శాస్తే జరిగిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో తన కన్నకూతురు 24 ఏళ్ల షీనాబోరాను ఇంద్రాణి తన మాజీ భర్త ఖన్నా, డ్రైవర్ శ్యామ్ తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే! ఈ కేసును విచారించిన పోలీసులకు చాలా చుక్కలు కనిపించాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. చివరకు షీనాని చంపింది తల్లి ఇంద్రాణియేనని పోలీసులు తేల్చేశారు. ఈ కేసులో ఆమెను పోలీసులు గత ఆగస్టు 25న అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం బైకుల్లా జైల్లో వున్న ఈమె.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో జగన్నాటకాలు ఆడిన విషయం విధితమే! ఈ నెల ప్రారంభంలో ఆమె అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లి అటు జైలు అధికారులతోపాటు షీనా కేసు దర్యాప్తు అధికారులను కలవరపెట్టింది. అప్పుడు ఆమె ఈ కేసునుంచి తప్పించుకునే భాగంలోనే ఈ నాటకం ఆడిందని అనుమానించారు. నిజానికి ఆమె నిజంగా అనారోగ్య బారిన పడిందో లేదో తెలీదు కానీ.. డాక్టర్లు కొద్దిరోజులపాటు చికిత్స చేసి తిరిగి ఆమెకు జైలు తలరించారు. జైలుకు తిరిగొచ్చిన వెంటనే ఈమె విచారణలో భాగంగా సంచలన విషయాలను బట్టబయలు చేసింది. తన కూతురు షీనాను తాను చంపలేదని, తన మాజీ భర్త ఆమె భవిష్యత్తుపై కలవరం పెంచుకుని ఆ ఆవేదనలో చంపేశాడని తెలిపింది. అందుకు డ్రైవర్ శ్యామ్ సహకరించినట్లుగా ఆమె చెప్పింది. ఆమె వాంగ్మూలం ప్రకారమే జైలు అధికారులు విచారణ చేపట్టారు కూడా. అయితే.. ఆమె అరెస్టు రోజు మొదలుకుని ఇప్పటివరకు ఎన్నో కహానీలు సృష్టించినందుకుగాను ఇప్పుడు తగిని శాస్తి జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆమెకు ఏమైంది? అనేగా సందేహం. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

రిమాండ్ ఖైదీగా జైల్లో వున్న ఇంద్రాణి ముఖర్జియా ఈసారి నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. గత ఏడు రోజులుగా ఆమె డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు కోర్టుకు వివరించినట్లు సమాచారం. ఆమె రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య సాధారణ స్థాయి నుంచి 65,000కు పడిపోయిందని వారు న్యాయస్థానానికి తెలిపారు. తొలుత ఆమెకు వైద్యులు జైలులోనే చికిత్స అందించగా.. పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆమెను దగ్గరలోనే జెజె ఆసుపత్రికి తలరించారని తెలిసింది. కాగా, ఇంద్రాణి ఫోన్ కాల్స్ కు సంబంధించిన కొన్ని రికార్డులు తమకు లభ్యమయ్యాయని, ఆమె వాయిస్ ను సరిపోల్చుకోవడానికి ఆమె స్వర నమూనాలను పంపాలని కేసును విచారిస్తున్న సీబీఐ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indrani mukherjea dengue  sheena bora murder case  

Other Articles